మహారాష్ట్ర తరువాత..మరో రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ

పనాజీ: మొన్నటి వరకు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున పొలిటికల్ హైడ్రామా నడిచింది. ఇప్పుడు మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న గోవాలో అలాంటి పరిస్థితే ఏర్పడింది. కాంగ్రెస్‌లో తిరుగుబాటు చెలరేగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం నిర్వహించిన భేటీకి ఏడుమంది గైర్హాజర్ అయ్యారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అగ్ర నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారు. ఆ ఏడుమంది కూడా అధికార భారతీయ జనతా పార్టీతో టచ్‌లో ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి.

సోమవారం నుంచి గోవా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు వారాల పాటు కొనసాగనున్నాయి. ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై చర్చించడానికి గోవా కాంగ్రెస్ చీఫ్ అమిత్ పాట్కర్.. సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఏడుమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కలకలం రేపుతోంది. వారు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పబోతోన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Goa: 7 Congress MLAs skipped a party meeting a day before an assembly session

ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన వారిలో దిగంబర్ కామత్ కూడా ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రతిపక్ష నేతగా మైఖెల్ లోబో అపాయింట్ అయ్యారు. దీన్ని దిగంబర్ కామత్ గట్టిగా వ్యతిరేకిస్తోన్నారనే ప్రచారం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా మైఖెల్ లోబోను నియమించడాన్ని కామత్ ఎక్కడా బహిరంగంగా తప్పు పట్టకపోయినప్పటికీ.. అంతర్గతంగా అసంతృప్తిగా ఉంటోన్నారే ప్రచారం ఉంది.

కాగా- తమ పార్టీకి చెందిన ఏడుమంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల గోవా కాంగ్రెస్ చీఫ్ అమిత్ పాట్కర్ స్పందించారు. వారంతా బీజేపీతో టచ్‌లో ఉంటోన్నారనే విషయాన్ని తోసిపుచ్చారు. అధికార బీజేపీ చేస్తోన్న తప్పుడు ప్రచారంగా విమర్శించారు. కాంగ్రెస్‌ను ఎవ్వరూ వీడిపోవట్లేదని, పార్టీతోనే ఉంటారనీ అన్నారు. దిగంబర్ కామత్ వంటి నాయకుడు పార్టీకి గుడ్‌బై చెబుతారని తాను అనుకోవట్లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+