Goa Assembly elections: సోమవారం ఒకే దశలో 40 స్థానాలకు ఎన్నికలు

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో బహుముఖ ఎన్నికల పోటీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సవాల్ విసురుతున్నాయి.

గోవా అసెంబ్లీకి 40 మంది సభ్యుల బలం ఉంది, అందులో బీజేపీకి ప్రస్తుతం 17 మంది శాసనసభ్యులు ఉన్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)కి చెందిన విజయ్ సర్దేశాయ్, ముగ్గురు స్వతంత్రుల మద్దతు బీజేపీకి ఉంది.
జీఎఫ్‌పి, ఎంజీపీలకు ఒక్కొక్కరు ముగ్గురు ఎమ్మెల్యేలు, మరోవైపు కాంగ్రెస్‌కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

 Goa Assembly elections: the polls in single phase on Monday

గోవాలో వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 301 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో పాటు అధికార బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రధాన పోటీదారులుగా నిలిచాయి.

అయితే, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కూడా తన తండ్రి సంప్రదాయ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పనాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీకి రాజీనామా చేశారు.

బీజేపీ పనాజీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టర్న్‌కోట్ అటానాసియో "బాబుష్" మాన్‌సెరేట్‌ను పోటీకి దింపింది. 2019లో కాంగ్రెస్ నుంచి మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఈయన బీజేపీలో చేరారు.

రాష్ట్ర ఎన్నికల రాజకీయాలలో పనాజీ అసెంబ్లీ స్థానం దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. పనాజీ నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మూడు పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

గోవాలో వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారానికి దిగారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది.
గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ తన ముఖ్యమంత్రిగా రాజకీయవేత్తగా మారిన న్యాయవాది అమిత్ పాలేకర్‌ను ప్రకటించింది. కాగా, గోవాలో ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+