ఉప ఎన్నికలు: పనాజీ నుంచి మనోహర్ పారికర్ గెలుపు
గోవా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ విజయం సాధించారు. బిజెపి తరఫున పనాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప అభ్యర్థిపై 4,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పనాజీ: గోవా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ విజయం సాధించారు. బిజెపి తరఫున పనాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప అభ్యర్థిపై 4,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన విషయం తెలిసిందే.

తన గెలుపు అనంతరం పారికర్ మాట్లాడారు. గోవాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని చెప్పారు. ఇక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నానని, వచ్చే వారంలో ఢిల్లీకి వెళ్లి రాజీనామా ఇస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications