గోవా సీఎం పారికర్‌కు మళ్ళీ అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం రాత్రి మరోసారి ఆసుపత్రిలో చేరారు. డీ హైడ్రేషన్, బ్లడ్ ప్రెషర్ కారణాలతో ఆయన తిరిగి జీఎంసీ ఆసుపత్రిలో చేరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నిజానికి ఆయన గురువారమే ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలుండటంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చారు.

అయితే ఆయన తిరిగి అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.పారికర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Recommended Video

Goa Bypoll result- CM Manohar Parrikar defeats Congress by margin of 4803 votes
మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు ప్రత్యేకంగా వైద్య నిపుణులను నియమించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications