గుర్తు పట్టలేనంతగా గోవా సీఎం, ఆసుపత్రిలో మీటింగ్, ఫోటోలు వైరల్, లీడర్ అంటే!
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యానికి గురై విదేశాల్లో చికిత్స పొంది తిరిగి భారత్ చేరుకున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గుర్తు పట్టలేనంతగా కనిపిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అక్కడి నుంచి మంత్రులతో సంప్రధించి విధులు నిర్వహిస్తున్నారు.
తీవ్ర అనార్యోగంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు మొదట ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ఎయిమ్స్ ఆసుపత్రి చేరుకుని మనోహర్ పారికర్ ను పరామర్శించారు.

అనంతరం ఎయిమ్స్ వైద్యుల సూచనమేరకు విదేశాలకు వెళ్లిన మనోహర్ పారికర్ అక్కడ చికిత్స పొందారు. విదేశాల్లో చికిత్స పొందిన మనోహర్ పారికర్ ఇటీవల ఢిల్లీ చేరుకుని మళ్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్ శారీరకంగా చాల సన్నబడ్డారు. శరీరంలో ఎంతో మార్పు వచ్చినా ఆయన ప్రజల యోగక్షేమాలు, ప్రజా పరిపాలన గురించి ఆసుపత్రిలోనే మంత్రులు, అధికారులతో చర్చిస్తున్న సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అనారోగ్యంతో ఉన్నా ప్రజల గురించి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చూపిస్తున్న శ్రద్ద, ఆరాటం గురించి తెలుసుకున్న అనేక మంది ఆయన్ని సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు. ప్రజలకు సేవచేసే నాయకుడు అంటే మనోహర్ పారికర్ లాగా ఉండాలని అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications