Goa Elections 2022: బీజేపీ 22కు పైగా సీట్లు గెలుస్తుంది: గోవా సీఎం ప్రమోద్ సావంత్

గోవాలో ఎన్నికల పోరు కొనసాగుతోంది. గోవాలో నేడు పోలింగ్ జరగనున్న 40 అసెంబ్లీ స్థానాలకు 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అత్యధిక సంఖ్యలో ఓటర్లు తరలిరావాలని బీజేపీ మాత్రమే కాకుండా పలువురు రాజకీయ నేతలు, రాష్ట్ర గవర్నర్ ట్విట్టర్‌లో కోరారు.

22 స్థానాలకు పైగా బీజేపీ సాధిస్తుంది: ప్రమోద్ సావంత్

గోవా సీఎం ప్రమోద్ సావంత్ గోవాలో 22 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని పేర్కొన్న ప్రమోద్ సావంత్ బిజెపి 22కు పైగా సీట్లు గెలుస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. 10 ఏళ్లలో బిజెపి చేసిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రధాని మోదీ స్వయం సమృద్ధి 100 శాతం మెజారిటీతో మాకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది" అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.

గోవాలో పోలింగ్ సందర్భంగా ఈరోజు ప్రజాస్వామ్య వేడుకల దినోత్సవం. అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని తాను విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తు కోసం ఓటు, సుస్థిరతకు ఓటు, ఆకాంక్షల నెరవేర్పుకు ఓటు, సర్వతోముఖాభివృద్ధికి ఓటు, సుసంపన్నమైన గోవాకు ఓటు వెయ్యాలని ప్రమోద్ సావంత్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

గోవా ఓటర్లకు అమిత్ షా పిలుపు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవాలోని మా సోదరీమణులు మరియు సోదరులు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని తాను కోరుతున్నానని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సుస్థిరమైన, నిర్ణయాత్మకమైన, అవినీతి రహిత ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర అభివృద్ధికి భరోసా ఇస్తుంది. కాబట్టి బయటకు వచ్చి సంపన్నమైన గోవా కోసం ఓటు వేయండి అని పిలుపునిచ్చారు.

ఓటు వేసిన గోవా గవర్నర్ .. ప్రశాంతంగా పోలింగ్ పై హర్షం

ఈరోజు పోలింగ్ సందర్భంగా ఓటు వేసిన అనంతరం గోవా గవర్నర్‌ పిఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై మాట్లాడుతూ.. గోవాలో పోలింగ్ కు ప్రజలు సహకరిస్తున్నారు. ఇక్కడ పెద్దగా రాజకీయ గొడవలు లేవు. ఎన్నికలు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మరియు ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో ప్రశంసనీయమన్నారు. ఈ సంవత్సరం, ఎక్కువ మంది ప్రజలు బయటకు వచ్చి ఓటు వేస్తారని తాను ఆశిస్తున్నానని గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లై వెల్లడించారు.

అవినీతి రహిత గోవా కోసం ఓటెయ్యండి: ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్

పోలింగ్ సందర్భంగా గోవా అవినీతి రహితంగా మార్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రియమైన గోవా వాసులకు తన విజ్ఞప్తి అని పేర్కొన్న ఆయన గోవాలో అవినీతి వ్యవస్థను మార్చి అవినీతి రహితంగా చేయగల శక్తి మీకు ఉంది, దయచేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం సరైన వ్యక్తి కి ఓటు వేయండి అంటూ అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా గోవాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+