వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Goa elections: గోవాలో ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫోకస్, రాహుల్ గాంధీ సమక్షంలో అభ్యర్థుల విధేయతా ప్రతిజ్ఞ అందుకే!!

|
Google Oneindia TeluguNews

గోవాలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుతోంది. ముఖ్యంగా గోవా రాజకీయాలు ఫిరాయింపులపై ప్రధానంగా ఫోకస్ పెట్టి సాగుతున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న 40 మంది అభ్యర్థులు అఫిడవిట్లపై సంతకాలు చేసి పార్టీకి విధేయత కలిగి ఉంటామని, తాము గెలిస్తే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సామూహికంగా బాండ్ పేపర్ లపై సంతకాలు చేసి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ సైతం ఫిరాయింపులపై ఫోకస్ పెట్టి విధేయతా ప్రతిజ్ఞను చేయించింది.

Goa elections: గోవాలో గెలిస్తే హామీలు నెరవేరుస్తామని అఫిడవిట్ లపై సంతకాలు చేసిన ఆప్ అభ్యర్థులుGoa elections: గోవాలో గెలిస్తే హామీలు నెరవేరుస్తామని అఫిడవిట్ లపై సంతకాలు చేసిన ఆప్ అభ్యర్థులు

 రాహుల్ గాంధీ సమక్షంలో విధేయతా ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు

రాహుల్ గాంధీ సమక్షంలో విధేయతా ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు

కాంగ్రెస్ నాయకుడు మరియు ఎంపీ రాహుల్ గాంధీ ఒక రోజు పర్యటన కోసం గోవాకు వచ్చిన సందర్భంగా పార్టీ అభ్యర్థులు ఆయన సమక్షంలో విధేయత ప్రతిజ్ఞ చేశారు.గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా మంది ఫిరాయింపు లకు పాల్పడి పార్టీకి తీరని నష్టం చేశారు. ఈ క్రమంలో ఈ దఫా ఎన్నికలలో బరిలోకి దిగిన అభ్యర్థులు ఫిరాయింపులకు పాల్పడబోమని ప్రతిజ్ఞ చేసి తమ విధేయతను ప్రకటించారు. 2017లో గోవాలో మొత్తం 40 సీట్లకు గాను కాంగ్రెస్ 17, బీజేపీ 13 సీట్లు గెలుచుకున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ఉప ముఖ్యమంత్రిగా చేసిన బాబు కవ్లేకర్ నేతృత్వంలో 2019లో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మారారు.

రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పార్టీకి విధేయులై ఉంటామని ప్రతిజ్ఞ

రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పార్టీకి విధేయులై ఉంటామని ప్రతిజ్ఞ

రాహుల్ గాంధీ ముందుగా ఫిబ్రవరి 2న గోవాలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ అయితే పార్లమెంటు మరియు అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం కోసం రాయ్‌పూర్ పర్యటన కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది. ఇక తాజాగా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ ఫిరాయింపులలో పాల్గొనబోమని, పార్టీకి విధేయులై ఉంటామని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ తన పర్యటనలో పర్యాటక రంగ ప్రతినిధులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులతో కూడా సంభాషించనున్నారు.

సదా, మోర్ముగావ్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ

సదా, మోర్ముగావ్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ గోవాలో సదా, మోర్ముగావ్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించి, తర్వాత అభ్యర్థులతో సమావేశం అయ్యారు . ఇంటింటి ప్రచారంలో గోవా ప్రజలు రాహుల్ గాంధీని సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత పార్టీ విధేయత ప్రతిజ్ఞ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. దీనిలో ఎన్నికల అభ్యర్థులు మరియు ఇతర నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీకి విధేయత చూపుతామని ప్రమాణం చేస్తారు అని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (GPCC) ప్రతినిధి అంతకు ముందే ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫిరాయింపులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు గోవాకు పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న పి చిదంబరం ఇటీవల తెలిపారు. విధేయత ప్రధాన ప్రమాణంగా పరిగణించబడింది అని చిదంబరం చెప్పాడు.

రాష్ట్ర పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశాలు ..సాంక్విలిమ్ లో రాహుల్ బహిరంగ సభ

రాష్ట్ర పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశాలు ..సాంక్విలిమ్ లో రాహుల్ బహిరంగ సభ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గోవాలో రాష్ట్ర ముఖ్య నాయకులతో వరుస సమావేశాలను నిర్వహించారు. డోనా పౌలాలోని ఇంటర్నేషనల్ సెంటర్‌లో పార్టీ సీనియర్ కార్యకర్తలతో, 'ప్రతిజ్ఞ ఆఫ్ లాయల్టీ' కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ముందు పార్టీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. తరువాత, బిజెపి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను రంగంలోకి దింపిన సాంక్విలిమ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్ర

English summary
Congress focuses on defections in Goa. Loyalty pledges with the candidates in the presence of Rahul Gandhi for putting a check on defections in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X