Goa elections: భూమి పుత్రులు ఎజెండాతో గోవాలో పట్టుకోసం శివసేన ప్లాన్.. సక్సెస్ అయ్యేనా?
గోవాలో ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. గోవాలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఇక గోవాలో అడుగుపెట్టేందుకు శివసేన కూడా ప్రయత్నం చేస్తోంది. గోవాలో పట్టు సాధించడం కోసం, ఎన్నికలలో విజయం సాధించడం కోసం అసెంబ్లీ ఎన్నికల అజెండాలో ప్రధానంగా గోవాలోని స్థానికులకు ప్రైవేట్ రంగంలో 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని అసెంబ్లీ ఎన్నికల ఎజెండాలో 'మట్టి పుత్రులు' సమస్యపై ప్రధానంగా ఫోకస్ చేసింది.
Recommended Video

గోవా ఎన్నికల బరిలో 10 మంది శివసేన అభ్యర్థులు
40 మంది సభ్యుల గోవా శాసనసభకు శివసేన పార్టీ 10 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఫిబ్రవరి 14న ఓటింగ్ జరగనుంది. గోవాలో మొత్తం 13 మంది అభ్యర్థులను నిలబెట్టిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)తో పొత్తుతో శివసేన పోటీ చేస్తోంది. కానీ సేన క్యాడర్‌తో ఎన్నికల ప్రచారంలో, ప్రచార పోస్టర్లపై లేదా కండువాలపై ఎక్కడా కూడా పొత్తుల భాగస్వామి ఎన్సీపీ ఉనికి కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థుల కోసం గోవాలో ఉన్న శివసేన కార్యదర్శి ఆదేశ్ బాండేకర్ మాట్లాడుతూ, "మహారాష్ట్రలో మా పార్టీ అధినేత దివంగత బాలాసాహెబ్ థాకరే చేసినట్లుగా భూమి పుత్రుల కోసం పని చేయడమే ఎజెండాగా నిర్ణయించింది. ఇక్కడ గోవాలో సైతం భూమి పుత్రుల ఎజెండా అమలు కావడం లేదని మీరు స్పష్టంగా చూస్తున్నామని, అందుకే ప్రధానంగా స్థానికుల పైన ఫోకస్ పెట్టి ఎన్నికలకు వెళుతున్నామని పేర్కొన్నారు.

మట్టి పుత్రులకు న్యాయం చేయాలనుకుంటున్నామన్న శివసేన
పార్టీ గోవా యూనిట్ చీఫ్ మరియు మపుసా నియోజకవర్గ అభ్యర్థి జితేష్ కామత్ మాట్లాడుతూ, "తాము మట్టి పుత్రులకు న్యాయం చేయాలనుకుంటున్నాము. ప్రయివేటు రంగంలో 80 శాతం ఉద్యోగాలు గోవా వాసులకే ఉండాలన్నదే మా సంకల్పం అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో శివసేన ఇంతకుముందు 11 మంది అభ్యర్థులను నిలబెట్టింది, అయితే పనాజీ స్థానం నుండి బిజెపి టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు మద్దతు ప్రకటించి, ఆ స్థానం నుండి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

శివసేన గోవా ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు
భారత ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, 1989లో, శివసేన గోవాలో ఆరు స్థానాల్లో పోటీ చేసింది, అందులో ఐదు స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఈ ఆరు స్థానాల్లో కేవలం 6.64 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. శివసేన ఇప్పటివరకు చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 1994లో శివసేన కేవలం రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసి రెండింటిలోనూ డిపాజిట్ కోల్పోయింది. 1999లో ఆ పార్టీ 14 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయి కేవలం 2.74 శాతం ఓట్లను సాధించింది. 2002లో శివసేన 15 మంది అభ్యర్థులను నిలబెట్టి మొత్తం డిపాజిట్ కోల్పోయింది.

2017లోనూ డిపాజిట్లు కోల్పోయిన శివసేన .. ఈ సారైనా సక్సెస్ అవుతుందా?
2007లో ఏడు స్థానాల్లో పోటీ చేసి ఏడింటిలో డిపాజిట్ కోల్పోయింది. 2012లో ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టి అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. 2017లో ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దించగా, మూడు చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. శివసేన తన ఐదు దశాబ్దాల చరిత్రలో, మహారాష్ట్ర వెలుపల తక్కువ విజయాన్ని సాధించింది. ఏదేమైనా ఈ ఎన్నికలలో అయినా పట్టు సాధించడం కోసం శివసేన తాపత్రయపడుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications