వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా ఎన్నికల్లో టీఎంసీ విజయం ఖాయం; బీజేపీని ఓడించాలనుకునేవారు ఏం చెయ్యాలో చెప్పిన మమతాబెనర్జీ

|
Google Oneindia TeluguNews

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గోవా ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గోవా పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ సోమవారం "ఖేల్ జట్లో" నినాదాన్ని లేవనెత్తారు. రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, గోవా రాష్ట్రంలో ఎవరైనా బిజెపిని ఓడించాలనుకుంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

గోవా ఎన్నికల బరిలో టీఎంసీ అందుకే ... కారణం చెప్పిన మమతా బెనర్జీ

గోవా ఎన్నికల బరిలో టీఎంసీ అందుకే ... కారణం చెప్పిన మమతా బెనర్జీ

గోవాను అందమైన, అద్భుతమైన, శక్తివంతమైన రాష్ట్రంగా పేర్కొన్న బెనర్జీ, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగిందని , రాష్ట్రాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి లేదా ముఖ్యమంత్రి కావడానికి టీఎంసీ ఎన్నికల బరిలోకి దిగలేదని, కేవలం గోవా ప్రజలకు సహాయం చేయడానికి మాత్రమే ఎన్నికల బరిలోకి దిగింది అని వెల్లడించారు. గతంలోనూ మమతా బెనర్జీ ఇదే విషయాన్ని గోవా పర్యటన సందర్భంగా స్పష్టం చేశారు.

గోవా ఎన్నికల వ్యూహాల్లో టీఎంసీ .. ఎంజీపీతో పొత్తు ఖరారు


వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీకి ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలోని పురాతన ప్రాంతీయ సంస్థ - మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)తో పొత్తు పెట్టుకుంది. రెండు రోజుల గోవా పర్యటనలో ఉన్న బెనర్జీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో కలిసి రాష్ట్ర ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరైనా బిజెపిని ఓడించాలనుకుంటే, వారి ఇష్టానుసారం మాకు మద్దతు ఇవ్వవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

 గోవా కోసం ప్లాన్ సిద్ధం చేశానన్న మమతా బెనర్జీ

గోవా కోసం ప్లాన్ సిద్ధం చేశానన్న మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో తాను ఎలా ప్లాన్ చేశారో అదే విధంగా గోవా కోసం తన వద్ద ఒక ప్రణాళిక ఉందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో తీరప్రాంత రాష్ట్రంలో అమలు చేస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు.గతంలో తమ పార్టీ గోవాలో పోటీ చేయాలని భావించలేదని, అయితే ఇతర పార్టీలు బిజెపికి పోటీ ఇవ్వడం లేదని గ్రహించిన తర్వాత, టిఎంసి ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకుందని ఆమె వెల్లడించారు. ఇన్నాళ్లు మేము గోవాకు రాలేదు, కానీ గోవా ప్రజల కోసం ఎవరూ ఏమీ చేయడం లేదని మేము గ్రహించామని పేర్కొన్నారు మమతాబెనర్జీ. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ పోరాడలేదు కాబట్టే తాము గోవా నుండి బీజేపీ పై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Recommended Video

Telangana : జాతీయ రాజకీయాల్లో CM KCR అడుగులు.. Mamata Banerjee తో భేటీ! || Oneindia Telugu
కాంగ్రెస్ కు చురకలు, బీజేపీ హటావో .. ఖేల్ జట్లో నినాదంతో మమతా బెనర్జీ

కాంగ్రెస్ కు చురకలు, బీజేపీ హటావో .. ఖేల్ జట్లో నినాదంతో మమతా బెనర్జీ

కాంగ్రెస్‌ను ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడగలిగినప్పుడు, గోవాలో మేము కాంగ్రెస్ పై ఎందుకు పోరాడలేమో చెప్పాలన్నారు. తాము గోవాలో పోరాటం చేసి తీరుతామన్నారు. ఎవరి మాట వినాల్సిన అవసరం తమకు లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు . బిజెపితో లోపాయికారీ ఒప్పందాలు చేసుకోబోమని తేల్చిచెప్పారు. గోవాలో "ఖేల్ జట్లో" ఉంటుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమె గతంలో 'ఖేలా హోబ్' నినాదాన్ని లేవనెత్తారు. ఇప్పుడు "ఖేల్ జట్లో" అంటూ గోవా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అంతే కాదు బిజెపి హటావో అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, గోవాలో బీజేపీ అధికారం నుండి గద్దె దించాలని పిలుపునిచ్చారు.

English summary
Mamata Banerjee, who is on a tour of Goa, will raise the slogan "Khel Jatlo" on Monday. Expressing confidence that his party will win in the upcoming Goa Assembly elections, she said if anyone in Goa wants to defeat the BJP, they should support the TMC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X