పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్: 22-16తో విశ్వాస పరీక్షలో నెగ్గిన మనోహర్ పారికర్

Posted By:
Subscribe to Oneindia Telugu

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గురువారం నాడు శాసన సభలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ ఫ్లోర్ టెస్ట్‌లో పారికర్ గెలుపొందారు. మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం గట్టెక్కింది.

పారికర్ మంగళవారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఫ్లోర్ టెస్ట్ జరిగింది. విశ్వాస పరీక్షకు అనుకూలంగా (పారికర్‌కు మద్దతుగా) 22 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 16 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే గైర్హాజరయ్యారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో బీజేపీ 13 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు గెలుచుకుంది. ఇతరులు పది స్థానాలు గెలుచుకున్నారు.

సీఎంగా పారికర్ ప్రమాణం, కేబినెట్లో ఇతరులే ఎక్కువ: ఎల్లుండి పరీక్ష

Goa floor test LIVE: Proceedings in assembly begins

ఇతరులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 22 సభ్యుల బలం ఉంది. దీంతో మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి అయ్యారు. మేజిక్ ఫిగర్ 21. ఈ రోజు విశ్వాస తీర్మానం జరిగింది.

కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదు

విశ్వాస పరీక్ష అనంతరం పారికర్ మాట్లాడారు. తమకు అవసరమైన బలం ఉందని చెప్పారు. అయిదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలను కొన్నామన్న కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Goa Chief Minister Manohar Parrikar Comfortably Placed With Backing of 22 MLAs.
Please Wait while comments are loading...