'ఆ మాజీ సీఎం లంచాలు తీసుకున్నాడు'
గోవా: గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, గోవా మాజీ మంత్రి చర్చిల్ అలెమావో లు ఇద్దరూ లూయీస్ బెర్జర్ స్కాంలో నిందితులు అని గోవా పోలీసు అధికారులు అంటున్నారు. వీరిద్దరూ లంచాలు తీసుకున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి చర్చిల్ అలెమావో అరెస్టు అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమావో తమ అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని, అధికార దుర్వనియోగం చేశారని పోలీసు అధికారులు అన్నారు.

వీరిద్దరి వలన గోవా రాష్ట్రానికి నష్టం కలిగిందని వారి రిమాండ్ దరఖాస్తులో తెలిపారు. 2010-11 సంవత్సరాలలో మాజీ సీఎం, మాజీ మంత్రికి లంచాలు ఇచ్చామని లూయీస్ బెర్జర్ మాజీ అధికారి మేజిస్ట్రేట్ ముందు అంగీకరించిన విషయం తెలిసిందే.
రూ. 1,000 కోట్ల తాగు, మురుగు నీటి ప్రాజెక్ట్ అప్పగించడానికి వీరిద్దరు రూ.6.5 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగంబర్ కామత్ కు రూ. 50 లక్షలు ఒక సారి, రూ. 60లక్షలు ఒక సారి లంచాలు ఇచ్చారని, అలెమావోకు రూ. 50 లక్షలు, రూ. 15 లక్షలు రెండు సార్లు చెల్లించారని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications