Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Goa: గోవాలో గుండూరావ్ లెక్కలు, రిసార్టు రాజకీయాలు, ట్రబుల్ షూటర్ ఎంట్రీ, గుజరాత్ సీన్ రిపీట్ !

గోవా/బెంగళూరు: 2017లో గోవా శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో విఫలం అయింది. చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీ ఆడిన మైండ్ గేమ్ లో చితకలపడింది. ఐదు సంవత్సరాలు గోవాలో అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు ముందే ఆ పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు. గతంలో గుజరాత్ లో అమలు చేసిన రిసార్టు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి తెరమీదకు తెచ్చింది. గోవాకు చెందిన కాంగ్రెస పార్టీ నాయకులు, గోవాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లతో పోటీ చేసిన నాయకులను రిసార్టులకు తరలించారు. మా పార్టీకి మెజారీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర పార్టీలతో కలిసి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఈసారి బీజేపీకి మాత్రం ఆ చాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అంటే గోవాలో మా పార్టీ మెజారీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేము అని సర్వేల దెబ్బతో కాంగ్రెస్ పరోక్షంగా చెబుతున్నారు. గోవాలో 40 మంది శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2017లో గోవాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్లక్షంగా వ్యవహరించడంతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడంతో 2017లో మనోహర్ పారికర్ సీఎం అయిపోయారు. అయితే 2017లో జరిగిన మైండ్ గేమ్ కు అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, కర్ణాటక మాజీ మంత్రి, గోవా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు దినేష్ గుండూరావ్ అంటున్నారు. 2017లొ గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ బీజేపీ గూటికి చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యింది.

 గోవా నాయకుల రిసార్టు రాజకీయాలు

గోవా నాయకుల రిసార్టు రాజకీయాలు

ఐదు సంవత్సరాలు గోవాలో అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు ముందే ఆ పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు. గతంలో గుజరాత్ లో అమలు చేసిన రిసార్టు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి తెరమీదకు తెచ్చింది. గోవాకు చెందిన కాంగ్రెస పార్టీ నాయకులు, గోవాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లతో పోటీ చేసిన నాయకులను రిసార్టులకు తరలించారు.

 సర్వే ఫలితాల దెబ్బ

సర్వే ఫలితాల దెబ్బ

ఇటీవల గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సోమవారం రాత్రి విడుదల అయ్యాయి. ఒక్క సర్వే తప్పా మిగిలిన సర్వేలు అన్నీ గోవాలో హంగ్ గ్యారెంటీ అని తేల్చి చెప్పాయి. గోవాలో బీజేపీకి కానీ, కాంగ్రెస్ కు కానీ పూర్తి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండరని, ఇతర పార్టీల మద్దతుతోనే ఏ పార్టీ అయినా గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చి చెప్పాయి.

 పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం

పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం

మా పార్టీకి మెజారీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర పార్టీలతో కలిసి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఈసారి బీజేపీకి మాత్రం ఆ చాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అంటే గోవాలో మా పార్టీ మెజారీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేము అని సర్వేల దెబ్బతో కాంగ్రెస్ పరోక్షంగా చెబుతున్నారు.

 ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది

ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది

గోవాలో 40 మంది శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2017లో గోవాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్లక్షంగా వ్యవహరించడంతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడంతో 2017లో మనోహర్ పారికర్ సీఎం అయిపోయారు.

 చిదంబరం, గుండూరావ్ గోవా లెక్కలు

చిదంబరం, గుండూరావ్ గోవా లెక్కలు

2017లో జరిగిన మైండ్ గేమ్ కు అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, కర్ణాటక మాజీ మంత్రి, గోవా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు దినేష్ గుండూరావ్ అంటున్నారు. 2017లొ గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ బీజేపీ గూటికి చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యింది. కర్ణాటక మాజీ మంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ కూడా ఈసారి గోవా రాజకీయాల్లో ఎంట్రీ అయ్యారు.

Recommended Video

    UP Exit Polls: Uttar Pradesh లో మళ్ళీ ఆ పార్టీదే హవా..! | Oneindia Telugu
     ఉత్తర గోవాలో రాజకీయాలు

    ఉత్తర గోవాలో రాజకీయాలు

    గోవాకు చెందిన కాంగ్రెస పార్టీ నాయకులు, గోవాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లతో పోటీ చేసిన నాయకులను ఉత్తర గోవాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి రిసార్టుకు తరలించారు. మార్చి 10వ తేదీ గోవా ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తరువాత, గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాతే కాంగ్రెస్ పార్టీగా విజయం సాధించిన ఎమ్మెల్యేలను రిసార్టుల నుంచి బయటకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయ్యిందని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+