వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sonali Phogat కేసు విచారణ సీబీఐకి..? గోవా సీఎం ప్రమోద్ సావంత్

|
Google Oneindia TeluguNews

సోనాలి ఫొగట్ మృతిపై ఫ్యామిలీ మెంబర్స్ అనుమానం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. హత్య అని విశ్వసిస్తున్నారు. అయితే నిన్న ఫ్యామిలీ మెంబర్స్.. సీబీఐ విచారణ అడుగుతామని చెప్పారు. గోవా పోలీసులపై తమకు నమ్మకం ఉందని.. ఒకవేళ సందేహాం ఉంటే విచారణ జరపాలని కోరతామని అన్నారు. ఆ వెంటనే గోవా ప్రభుత్వం స్పందించింది.

సోనాలి కేసును గోవా పోలీసులు విచారిస్తున్నారని సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. కేసు విచారణ సరయిన క్రమంలోనే జరుగుతుందని.. అవసరం అనుకుంటే సీబీఐ విచారణ కోరతామని చెప్పారు. ఈ కేసు విషయమై తనకు హర్యానా సీఎం ఫోన్ చేశారని తెలిపారు. హర్యానా సీఎంను సోనాలి ఫ్యామిలీ మెంబర్స్ కలిశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారట.. అదే విషయాన్ని తనకు సీఎం చెప్పారని సావంత్ తెలిపారు. దీనికి సంబంధించి తనకు ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు.

Goa govt mulls handing over Sonali Phogat murder probe to CBI

దీనికి సంబంధించి ఇప్పటికే అన్నీ ప్రక్రియలు పూర్తవుతున్నాయని.. ఒకవేళ అవసరం అనుకుంటే సీబీఐ విచారణ కోరతామని తెలిపారు. సావంత్ ప్రకటనను సోనాలి కుటుంబ సభ్యులు స్వాగతించారు. సీబీఐ విచారణ జరిగితే తమకు సమ్మతమే అని చెప్పారు. దీంతో అయినా తమకు న్యాయం జరుగుతుందని వివరించారు.

మూడేళ్ల క్రితం సుధీర్ ఆహారంలో మత్తు కలిపాడట. అప్పుడే సోనాలిపై లైంగికదాడి కూడా చేశాడట. దానిని వీడియో తీయడమే కాదు.. వైరల్ చేస్తామని చెప్పాడని ఆమె సోదరుడు తెలిపారు. అప్పటినుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పేర్కొన్నారు. సోనాలికి గోవా తెలియదని.. ఆమెకు ప్లీ ప్లాన్‌గా తీసుకొచ్చారని పేర్కొనారు. సినిమా షూటింగ్ 24వ తేదీన ఉంటే.. 21, 22వ తేదీన ఎందుకు బక్ చేశారని అడిగారు. అంతేకాదు. సోనాలిపై విష ప్రయోగం జరిగిందని చెప్పారు. గోవా పోలీసులు ఇప్పటికే సుధీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇంతలో ఫ్యామిలీ పలు అనుమానాలు వ్యక్తం చేయగా.. సీబీఐ విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఇండికేషన్స్ ఇచ్చారు.

English summary
Goa Chief Minister Pramod Sawant said on Sunday that if need be, Central Bureau of Investigation will be given charge of the probe into the alleged murder of Haryana BJP leader Sonali Phogat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X