గోవాలో సంపూర్ణ లాక్ డౌన్ .. కరోనా తీవ్రతతో ఏప్రిల్ 29 నుండి మే 3వరకు కంప్లీట్ షట్ డౌన్!!

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు ప్రభుత్వాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య గోవా ప్రభుత్వం గురువారం సాయంత్రం నుండి కేంద్రపాలిత ప్రాంతమైన గోవాలో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 29 సాయంత్రం నుండి మే 3 ఉదయం వరకు గోవాలో పూర్తిగా లాక్ డౌన్: సీఎం సావంత్

ఏప్రిల్ 29 సాయంత్రం నుండి మే 3 ఉదయం వరకు గోవాలో పూర్తిగా లాక్ డౌన్: సీఎం సావంత్

ఏప్రిల్ 29 సాయంత్రం నుండి మే 3 ఉదయం వరకు గోవాలో పూర్తిగా లాక్ డౌన్ విధించబడుతుంది అని గోవా ప్రభుత్వం పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో అత్యవసరమైన సేవలకు మాత్రమే అనుమతి లభిస్తుందని గోవా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.ఏప్రిల్ 29 సాయంత్రం నుండి మే 3 ఉదయం వరకు గోవాలో పూర్తి లాక్డౌన్ విధించనున్నట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. లాక్డౌన్ సమయంలో అవసరమైన సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలు మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయని సిఎం చెప్పారు. లాక్ డౌన్ కాలంలో ప్రజా రవాణా నడవదని స్పష్టం చేశారు .

గోవాలో పెరుగుతున్న కరోనా కేసులు .. తాజా లెక్కలివే

గోవాలో పెరుగుతున్న కరోనా కేసులు .. తాజా లెక్కలివే

పర్యాటక ప్రాంతమైన గోవాలో కూడా కరోనావైరస్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం గోవా రాష్ట్రంలో మొత్తం 81,908 కేసులు నమోదు కాగా, అందులో 16,591 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా బారినుండి కోలుకున్న వారి సంఖ్య 64,231 గా ఉంది. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,086 గా ఉంది . తాజాగా గోవాలో గత 24 గంటల్లో 2110 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 748 మంది కరోనా నుండి కోలుకున్నారు. 31 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

ప్రజల ప్రాణాలు కాపాడటం కోసమే కఠిన నిర్ణయాలు : ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే

ప్రజల ప్రాణాలు కాపాడటం కోసమే కఠిన నిర్ణయాలు : ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే

రాబోయే 10 రోజుల్లో రాష్ట్రానికి రోజుకు 200 నుంచి 300 కోవిడ్ -19 సంబంధిత మరణాలు సంభవించే ప్రమాదం ఉందని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే పేర్కొన్నారు. మహమ్మారిని నియంత్రించడానికి లాక్డౌన్ విధిస్తే కరోనా కంట్రోల్ లోకి వస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎంతో చర్చించారు. ఆర్థిక కార్యకలాపాలు ముఖ్యమని, అయితే ప్రాణాలను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని రాణే అన్నారు.

Recommended Video

    CoWin, Aarogya Setu and Umang app will be open for vaccine registrations | Oneindia Telugu
    సంపూర్ణ లాక్ డౌన్ పై ప్రకటన చేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

    సంపూర్ణ లాక్ డౌన్ పై ప్రకటన చేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

    ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ మరియు మరికొన్ని ఆంక్షలు విధించిన రాష్ట్రంలో తాజాగా లాక్డౌన్ విధించడంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవా సీఎం ప్రమోద్ సావంత్, రెండవ వేవ్ "చాలా ప్రమాదకరమైనది" అని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన వైద్య మౌలిక సదుపాయాలను కల్పించిందని పేర్కొన్నారు. రేపు సాయంత్రం నుండి మే 3 సోమవారం వరకు సంపూర్ణంగా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని, ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+