శరీరం కనిపించేలా బట్టలు, జట్టు కత్తిరించుకుంటున్నారు: మంత్రి భార్య
పనాజీ: పిల్లల్ని కాన్వెంట్‌లకు పంపించొద్దంటూ గోవా మంత్రి దీపక్ ధవళికర్ భార్య లత కొత్త వివాదానికి తెరలేపారు. దేశంలో రేప్‌లు, అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. వివాదాస్పద సంస్ధ ఆయిన సనాతన్ సౌనస్ధా ఆదివారం మడ్గావ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"హిందు పురుషులు బయటకు వెళ్లేటప్పుడు తిలకం పెట్టుకోవాలని, మహిళలు కుంకుం పెట్టుకోండి. జనవరి 1వ తేదీని నూతన సంవత్సరంగా కాకుండా గుడి పఢ్వాను చేసుకోండి. పిల్లలను కాన్వెంట్ స్కూళ్లకు పంపొద్దు. ఫోన్‌లో 'హలో'కు బదులు నమస్కార్ అనండి" అంటూ లత అన్నారు.

భారతీయ సంస్కృతిని కాపాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇటీవల కాలంలో మహిళలు నుదుటిన కుంకుమ పెట్టుకోవడం మానేశారని, శరీరం కనిపించేలా బిగుతు బట్టలేసుకుంటున్నారని, జడలు వేసుకోవడం మానేసి జుత్తును కత్తిరించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భార్య చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు దీపక్ ధవలికర్ నిరాకరించారు. దీపక్ ధవలికర్ గోవా రాష్ట్రానికి ఫ్యాక్టరీస్ మరియు బ్రాయిలర్ మంత్రిగా ఉన్నారు. గత ఏడాది లత మరిది, మంత్రి సుధిన్ ధవలికర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి వ్యతిరేకమైన బికినీల కల్చర్‌ను గోవాలో నిషేధించాలంటూ విమర్శలు చేశారు.
అనంతరం సుధిన్ ధవలికర్ చేసిన వ్యాఖ్యలపై గోవా ప్రజలు, టూరిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు తెలియజేయడంతో తన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇది ఇలా ఉంటే లత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మతం ప్రాతిపదికన రాష్ట్రాన్ని విడగొట్టే కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది.












Click it and Unblock the Notifications