
Goa Polls: గోవాలో ఫిరాయింపులకు చెక్ పెడుతూ ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
గోవా ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా రెడీ అవుతుంది. ఇప్పటికే గోవాలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు ఏయే అంశాలపై గోవాలో ప్రధానంగా ప్రచారం నిర్వహించాలని విషయాలపై కసరత్తులు సాగిస్తూనే, గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఫిరాయింపులను అరికట్టడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Goa
Polls:
కేజ్రీవాల్
వర్సెస్
మమతా
బెనర్జీ,
గోవాలో
టీఎంసీ
రేసులో
కూడా
ఉండదన్న
ఆప్
అధినేత

ఫిరాయింపు నేతలపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం
అందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థులు తమ పార్టీని వీడి మరొకరిలో చేరబోమని పేర్కొంటూ చట్టపరమైన అఫిడవిట్‌లపై సంతకం చేయాల్సి ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ నాయకులు ఇతర పార్టీలకు జంప్ చేయడంలో గోవా రాష్ట్రం ప్రసిద్ధి చెందింది అని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆప్ నాయకుడు అమిత్ పాలేకర్ వెల్లడించారు

అఫిడవిట్ లపై ఆప్ నేతలు సంతకాలు చేస్తారన్న ఆప్ నేత పాలేకర్
ఫిబ్రవరి 2022లో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. గోవా చిన్న రాష్ట్రమైనప్పటికీ రాజకీయ ఫిరాయింపులకు పేరుగాంచిందని ఆప్ నేత అమిత్ పాలేకర్ విలేకరులతో అన్నారు. సమస్యను పరిష్కరించడానికి, ఆప్ అభ్యర్థులు చట్టపరమైన అఫిడవిట్‌పై సంతకం చేస్తారని , వారు మరొక పార్టీలో చేరడానికి ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టబోమని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ నేతలు ఫిరాయింపులపై హామీ ఇవ్వగలరా? ప్రశ్నించిన ఆప్ నేత
తమ అభ్యర్థులు ఫిరాయింపులు చేయబోరని, కాంగ్రెస్ నుంచి ఏమైనా హామీ ఇవ్వగలరా అని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు.రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా తమ అభ్యర్థి బీజేపీలో చేరబోదని హామీ ఇచ్చే పరిస్థితి లేదని, 2019లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో చోటు దక్కించుకున్న అలెక్సో రెజినాల్డో లారెన్కో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారని పాలేకర్ పేర్కొన్నారు. గోవాలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లోకి కూడా వలసలు మొదలయ్యాయి అని పాలేకర్ వెల్లడించారు

అభ్యర్థుల అఫిడవిట్లు ప్రజల చేతుల్లో ... ఫిరాయిస్తే చట్టపరమైన చర్యలు
మరో కాంగ్రెస్ అభ్యర్థి కూడా త్వరలో బిజెపిలో చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇటువంటి ఫిరాయింపుల ద్వారానే పక్క పార్టీలను దెబ్బతీయాలని అధికార బీజేపీ భావిస్తోందని పేర్కొన్న పాలేకర్ ఈ సమస్యను పరిష్కరించడానికి, ఆప్ అభ్యర్థులు అఫిడవిట్లపై సంతకం చేస్తారని, వారి ఓటర్లకు పంపిణీ చేస్తామని, వారు ఏ ఇతర పార్టీలో చేరబోమని హామీ ఇచ్చారని పాలేకర్ చెప్పారు. ఒకవేళ ఎవరైనా పార్టీ ఫిరాయింపుకు పాల్పడితే ఓటర్లకు ఆప్ నేతలు ఇస్తున్న అఫిడవిట్ల ద్వారా ఓటర్లు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు.

పార్టీ వీడితే ఎమ్మెల్యేలుగా అనర్హులే .. ఆప్ నిర్ణయం లాభిస్తుందా ?
ఆప్ తన అభ్యర్థిని ప్రకటించిన వెంటనే, వారు అఫిడవిట్లపై సంతకం చేస్తారని పాలేకర్ చెప్పారు. ఒక అభ్యర్థి ఆప్‌ని వీడి వేరే పార్టీలో చేరితే వెంటనే ఎమ్మెల్యేలుగా అనర్హులవుతారు అని పాలేకర్ స్పష్టం చేశారు. మొత్తానికి పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా ఉండే గోవాలో, పార్టీ ఫిరాయింపుల కు చెక్ పెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు పార్టీకి లాభం చేకూరుస్తుంది అనేది వేచి చూడాలి.