వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా ఫలితాలు: అక్కడ మనోహర్ పారికర్ సంప్రదాయాన్ని కొనసాగించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

|
Google Oneindia TeluguNews

ఐదు రాష్ట్రాల ఎన్నికల కు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. నేతల భవితవ్యం తేలే రోజున ప్రధాన పార్టీలన్నీ ఓటర్ల తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మరోపక్క గోవాలో ను ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ కొనసాగుతోంది. గోవాలో కౌంటింగ్ రోజున దివంగత మనోహర్ పారికర్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన నియోజకవర్గమైన సాంక్వెలిమ్ లోని శ్రీ దత్త మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Recommended Video

BJP takes Lead in Goa, Chief Minister Pramod Sawant Confident

మనోహర్ పారికర్ సాంప్రదాయాన్ని కొనసాగించిన ప్రమోద్ సావంత్

గురువారం ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న ఆయన, గోవా ఎన్నికలలో బిజెపి విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవా మాజీ సీఎం,కేంద్ర మాజీ మంత్రి ఆయన మనోహర్ పారికర్ కూడా గతంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా దత్త మందిర్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఫలితాల రోజున కౌంటింగ్ జరుగుతున్న సమయంలో దత్త మందిరాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమోద్ సావంత్ వెంట పూజా కార్యక్రమాలలో ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

ఎంజీపీతో సంప్రదింపులు జరుపుతున్న బీజేపీ

ఎంజీపీతో సంప్రదింపులు జరుపుతున్న బీజేపీ

కోస్తా రాష్ట్రం అయిన గోవాలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా బీజేపీకి చెందిన ప్రమోద్ సావంత్ గోవాలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సావంత్ బిజెపి కార్యాలయంలో ప్రార్థనలు చేశారు. ఈసారి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో పొత్తు లేకున్నా, రెండు పార్టీలు సిద్ధాంత పరంగా ఒకే విధంగా ఉన్నందున అవసరమైతే ప్రాంతీయ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మద్దతు లభిస్తుందనే నమ్మకం ఉందని పార్టీ పేర్కొంది.వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది.

ఎగ్జిట్ పోల్స్ లో హంగ్ అసెంబ్లీ.. ఫలితాలపై ఉత్కంఠ

ఎగ్జిట్ పోల్స్ లో హంగ్ అసెంబ్లీ.. ఫలితాలపై ఉత్కంఠ


సావంత్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నుండి ఇద్దరు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ మంత్రులను తొలగించడంతో 2019లో బిజెపి మరియు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో, ఎంజీపీ బీజేపీకి మద్దతు ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. చాలా ఎగ్జిట్ పోల్స్ గోవాలో హంగ్ అసెంబ్లీని అంచనా వేసింది. ఫలితాల అనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి రాజకీయ పార్టీలు. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గం.లకు ప్రారంభమయ్యింది. మరో రెండు గంటల వ్యవధిలోనే గోవా రాష్ట్రంలో అధికారం ఎవరి హస్తగతం అవుతుందో స్పష్టత వచ్చే అవకాశముంది.

English summary
Goa Chief Minister Pramod Sawant has said that more than 22 seats in Goa will win bjp . Home Minister Amit Shah and Goa Governor Sreedharan Pillai have called on Goa voters to vote. Arvind Kejriwal has appealed for a vote for a corruption-free Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X