India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

GoaFest 2022: డైలీహంట్ "వైబ్‌చెక్" కార్యక్రమానికి యాబీ అవార్డు

|
Google Oneindia TeluguNews

డైలీహంట్ మరియు రెడ్ ఎఫ్ఎంలు సంయుక్తంగా ప్రారంభించిన షార్ట్ వీడియోస్ న్యూస్ కార్యక్రమం " వైబ్ చెక్" గోవా ఫెస్ట్ 2022 యాబీ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ అవార్డును గెలుచుకుంది.వెబ్/యాప్/సోషల్ పబ్లిషర్ల నుంచి డిజిటల్ పబ్లికేషన్ అడ్వర్టయిజింగ్ మరియు మార్కెటింగ్ కేటగిరీలో కాంస్యం అవార్డును అందుకుంది. మే 5వ తేదీ నుంచి మే 7 వతేదీ వరకు జరిగిన గోవా ఫెస్ట్ దక్షిణాసియాలోనే అతి పెద్ద అడ్వర్టయిజింగ్ ఫెస్టివల్‌గా ఖ్యాతి గడించింది.ఈ అవార్డుల కార్యక్రమానికి గోవాలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికగా నిలిచింది. అడ్వర్టయిజింగ్ క్లబ్ నేతృత్వంలో చాలా గ్రాండ్‌గా యాబీ అవార్డుల కార్యక్రమం జరిగింది.

పలు భారతీయ భాషల్లో ఉన్న డైలీ హంట్ ప్రముఖ రేడియో నెట్‌వర్క్ రెడ్ ఎఫ్ఎంతో వైబ్ చెక్ కార్యక్రమం చేసేందుకు జతకట్టింది. రెడ్ ఎఫ్ఎంలోని ఆర్జేలను రిపోర్టర్లుగా మలుస్తూ డైలీహంట్ పై షార్ట్ వీడియోల ద్వారా వార్తలును ప్రెజెంట్ చేసింది. ముఖ్యంగా మాట్లాడలేనివారికి, వినికిడి లోపం ఉన్నవారికి వార్తలు అందించడంలో సఫలమైంది. ఇక ఈ వార్తలను ఆయా భారతీయ భాషల్లో తర్జుమా చేసేలా డైలీ హంట్ యాంకర్లు ఉంటారు. ఈ షో లాంచ్ అయిన వారం రోజుల్లోనే దాదాపు 20 మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. దీంతో ప్రధాన న్యూస్ ప్లాట్‌ఫారంలకు ప్రత్యామ్నాయంగా మారిందని చెప్పొచ్చు.

GoaFest 2022: Dailyhunts VibeCheck bags Bronze at Abby Awards

స్పీచ్ మరియు వినికిడి లోపంతో ఉన్న దివ్యాంగుల కోసం వారికి జీవనోపాధి కల్పించడం కోసం ఇంక్లూజివ్ దివ్యాంగ్‌జన్ ఎంట్రప్య్రూనర్‌ అసోసియేషన్ (IDEA) అనే సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థ కూడా వైబ్ చెక్ కార్యక్రమంతో చేతులు కలిపి దివ్యాంగుల కోసం మంచి కంటెంట్ అందించేందుకు ముందుకొచ్చింది.

"డైలీ హంట్‌లో, ఆకర్షణీయమైన, ప్రామాణికమైన మరియు అత్యంత ముఖ్యమైన - యాక్సెస్ చేయగల కంటెంట్‌ని సృష్టించేందుకు, ఆవిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తాం. మేము మా వినియోగదారులను వార్తలకు విలువైన కంటెంట్‌తో నిమగ్నం చేయడం మరియు శక్తివంతం చేయడం కోసం Vibe Checkని ప్రారంభించాము. మాట్లాడలేకపోవడంమరియు వినికిడి లోపం ఉన్నవారికి కంటెంట్ కలుపుకొని ఉంటుంది మరియు యాక్సెస్ చేయగలదు. గోవా ఫెస్ట్‌లో యాబి అవార్డును గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాతో జతకట్టి భాగస్వాములైన రెడ్ ఎఫ్ఎం మరియు ఐడియా సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ అవార్డు మేము పడ్డ కష్టానికి ఒక గుర్తింపు అంతేకాదు ఒక సాక్ష్యంగా కూడా నిలుస్తోంది. భవిష్యత్తులో మరింత నాణ్యమైన కంటెంట్ అందించేందుకు ఇది ఒక ప్రోత్సాహంలా భావిస్తాం"అని ఎటర్నో ఇన్ఫోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావణన్ తెలిపారు.

రెడ్ ఎఫ్‌ఎం అనేది సాహసాలకు మరియు సృజానాత్మకతకు నిలయం అని చెప్పారు రెడ్‌ఎఫ్‌ఎం మరియు మ్యాజిక్ ఎఫ్ఎం డైరెక్టర్ నిషా నారాయణన్. ఏదైన కొత్త కంటెంట్‌పై ఎప్పుడూ ప్రయత్నం చేయడం దాన్ని సక్సెస్ చేయించడం అనేది తమ ప్రత్యేకత అని చెప్పారు. ఈ క్రమంలోనే రెడ్ ఎఫ్ఎం డైలీహంట్ సంయుక్తంగా ప్రారంభించిన వైబ్ చెక్ కార్యక్రమం యాబీ అవార్డులు గెలవడం చాలా సంతోషం కలిగించిందన్నారు.న్యూస్ ఇండస్ట్రీని మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. డైలీహంట్‌తో కలిసి దివ్యాంగులకు కంటెంట్ అందించడం చాలా తృప్తిని సంతోషాన్నిస్తోందని చెప్పారు.ఈ అవార్డుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని మరింత కొత్త కంటెంట్‌తో ముందుకొస్తామని చెప్పారు.

డైలీహంట్‌ స్థానిక భాషల్లో వార్తలు అందించే యాప్. దాదాపు 15 భారతీయ భాషల్లో వార్తలను అందిస్తూ రోజుకు ఒక మిలియన్ వార్తలను యూజర్స్‌కు అందిస్తోంది.డైలీహంట్ దాదాపుగా 50వేలకు పైగా కంటెంట్ క్రియేటర్లతో జతకట్టి వార్తలను అందిస్తోంది.అన్ని రంగాల్లో కంటెంట్ పరంగా ముందుగా నిలవాలనే తపనతో డైలీహంట్ కృషి చేస్తోంది. నెలకు 350 మిలియన్ యాక్టివ్ యూజర్లతో డైలీహంట్ ముందుకెళుతోంది. రోజుకు ఒక యూజర్ 30 నిమిషాల పాటు డైలీహంట్‌పై సమయం గడుపుతారు. అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా యూజర్లు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో గుర్తెరిగి ఆ మేరకు కంటెంట్‌ను ఇస్తోంది డైలీహంట్.డైలీహంట్ యాప్ అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ మరియు మొబైల్ వెబ్‌పై లభిస్తోంది.

English summary
Dailyhunt and Red FM's first-of-its-kind, innovative and inclusive short-video news delivery program 'Vibe Check' has bagged an award at the Abby Awards at Goafest 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X