మంగళసూత్రం బాగుందని మెడ కోశాడు..: కర్ణాటకలో వీడిన హిందూపురం మహిళ మిస్టరీ

బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటో ఈఎంఐ చెల్లించేందుకు దారుణ హత్యకు పాల్పడ్డాడు. పక్కా ప్లాన్ ప్రకారం తన స్నేహితురాలిని హత్య చేశాడు. దీనికోసం తన స్నేహితుల సహకారాన్ని తీసుకున్నాడు. కర్ణాటకలోని చిక్ బల్లాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ నెల 16వ తేదీన జిల్లాలోని మంచెనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నామగొండ్ల గ్రామ సమీపంలో ఒక వంతెన వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. మిస్సింగ్ కేసుల రికార్డులను తిరగేశారు. మృతురాలు ఏపీలోని హిందూపురానికి చెందిన అర్చనగా గుర్తించారు. ఆమె తప్పిపోయినట్లు హిందూపురం పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.

Gold Robbery Gone Wrong Auto Driver and Female Friend Arrested for Murder

దర్యాప్తులో భాగంగా గౌరీబిదనూరు సీఐ సత్యనారాయణ, మంచేనహళ్లి ఎస్ఐ.. మృతురాలు అర్చన కాల్ డేటా రికార్డ్ ను పరిశీలించారు. ఆమె కనిపించకుండా పోయిన రోజు రాకేష్ అనే వ్యక్తితో చాలాసార్లు కాల్ చేసినట్లు వెల్లడైంది. దీంతో బెంగళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న గౌరీబిదనూరు విరూపసంద్రకు చెందిన రాకేష్‌ను అదుపులోకి తీసుకుని, ఇంటరాగేట్ చేశారు. విచారణలో రాకేష్ నేరాన్ని అంగీకరించాడు.

ఆటో ఈఎంఐ మూడు నెలలుగా కట్టలేదని, బైక్‌పై 30,000 రూపాయలు అప్పు చేశానని, అది తీర్చడానికి కూడా డబ్బు లేదని ఒప్పుకున్నాడు. ఇతర అప్పులు కూడా ఉన్నాయని, వాటిని తీర్చడానికి తన స్నేహితురాలు అర్చనను హత్య చేసినట్లు అంగీకరించాడు. అర్చన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థతో పని చేస్తుండేది. ఈ క్రమంలో ఆమెకు రాకేష్ తో పరిచయం ఏర్పడింది. ఫ్రెండ్ షిప్ కొద్దీ తరచూ ఇద్దరూ వీడియో కాల్ లో మాట్లాడుకునే వాళ్లమని రాకేష్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.

ఆ సమయంలో అర్చన మెడలో మంగళసూత్రం, నెక్లెస్ ఉండటాన్ని చూసి దాన్ని దొంగిలించాలని అనుకున్నాడు. దాన్ని అమ్మితే- తన అప్పులన్నీ తీరిపోతాయని భావించాడు. ఆమెను హతమార్చడానికి ప్లాన్ చేశాడు. దీనికి సహకరించాలని నిహారిక అనే ఫ్రెండ్ ను కోరాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. మరో స్నేహితురాలు అంజలితో పాటు నవీన్‌ అనే వ్యక్తి సహకారం తీసుకున్నాడు రాకేష్. ఆటోలో హత్య చేయడం కష్టమని భావించిన రాకేష్ అంజలికి చెందిన కారును వినియోగించాడు.

హిందూపురానికి వెళ్తున్నామంటూ 14న బెంగళూరు నుంచి రాకేష్, అంజలి, నవీన్ ముగ్గురూ నేరుగా హిందూపురం వెళ్లి అర్చనను మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కారులో ఎక్కించుకుని భోజనానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లారు. రాకేష్, మిగతావాళ్లు హిందూపురంలోనే ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. హిందూపురం నుంచి బయలుదేరిన కారు గౌరీబిదనూర్ మంచేనహళ్లి మీదుగా చిక్కబళ్ళాపూర్, జాతీయ రహదారి 44లో సాయంత్రం వరకు ప్రయాణించింది.

చీకటి పడ్డాక హిందూపురం సమీపంలోని చిలమత్తూరు వద్ద కారులో అర్చన మెడకు దుపట్టాతో బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని నామగొండ్ల సమీపంలోని పెద్ద వంతెన వద్ద పడేసి పారిపోయారు. అర్చనను హత్య చేసి మంగళసూత్రం, బంగారు చెవిపోగులను దొంగిలించారు. ఓ ఫైనాన్స్‌లో రూ. 2.19 లక్షలకు తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బుతో ఆటో ఈఎంఐ, అప్పులు తీర్చాడు. ఈ కేసులో రాకేష్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. అంజలిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు నవీన్, నిహారిక కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+