వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Gold smuggling: కోర్టులో ఈడీ చార్జ్ షీట్, ఐఏఎస్ కీరోల్ ?, స్వప్న కథ గోవిందా గోవింద, మేడమ్ తో లింక్ !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ తిరువనంతపురం/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుదిపేసిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణ ఓ కొలిక్కి వస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో A2 నిందితురాలిగా ఉన్న స్వప్న సురేష్ అలియాస్ స్వప్న వ్యవహారం ఒక్కొక్కటి బయటకు వస్తోంది. ఇప్పటికే జైల్లో ఉన్న స్వప్న సురేష్ కు మరికొన్ని కష్టాలు ఎదురౌతున్నాయి. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు కొచ్చిలోనీ PLMA కోర్టులో 303 పేజీల చార్జ్ షీటు దాఖలు చేశారు. కేరళకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకరన్ కీరోల్ పోషించారని, ఆయన్ను మరింత లోతుగా విచారణ చెయ్యాలని అధికారులు సిద్దం అయ్యారు. ఈ దెబ్బతో స్వప్న కథ గోవిందా గోవింద అంటున్నారు. ఐఏఎస్ శివశంకర్ తో కిలాడీ మేడమ్ స్వప్నకు చాలా లింక్ లు ఉన్నాయని తెలిసింది.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 స్వప్న ఫ్యామిలీకి సార్ చాలా క్లోజ్ !

స్వప్న ఫ్యామిలీకి సార్ చాలా క్లోజ్ !

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న స్వప్న మేడమ్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కేరళ ఐఏఎస్ అధికారి శివశంకర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారుల విచారణ వెలుగు చూసింది. ఇప్పటికే అనేకసార్లు స్వప్న సురేష్ ను ఐఏఎస్ అధికారి శివశంకర్ ఆర్థిక సహాయం చేశారని, ఆమెను అన్నిరకాలుగా ఆదుకున్నారని అధికారులు విచారణలో వెలుగు చూసింది.

 చార్టెడ్ అకౌంటెంట్ ఎవరంటే ?

చార్టెడ్ అకౌంటెంట్ ఎవరంటే ?

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఈడీ అధికారులు ఆగస్టు 12, 15వ తేదీల్లో కేరళ ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ ను విచారణ చేసి ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ను అధికారికంగా రికార్డు చేశారు. తనకు 2017 నుంచి స్వప్న సురేష్ పరిచయం ఉందని ఐఏఎస్ అధికారి శివశంకర్ ఈడీ అధికారుల విచారణలో అంగీకరించారని తెలిసింది. 2018లో చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ ను ఈ ఐఏఎస్ అధికారి శివశంకర్ స్వయంగా స్వప్న సురేష్ కు పరిచయం చేశారని ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 జాయింట్ అకౌంట్ బ్యాంక్ లాకర్లు

జాయింట్ అకౌంట్ బ్యాంక్ లాకర్లు

కేరళ అధికార పార్టీ నేతలతో స్వప్న సురేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ తో పాటు స్వప్న సురేష్ ఎన్ సీబీఐ బ్యాంకులో జాయింట్ లాకర్లు తెరిచారని అధికారులు గుర్తించారు. స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు పరిశీలించిన అధికారులు అందులో రూ. 1. 50 కోట్ల నగదు, రూ. కోట్లు విలువైన బంగారం ఉన్నట్లు గుర్తించారు.

బ్యాంకు లాకర్లు సీజ్

బ్యాంకు లాకర్లు సీజ్

స్వప్న సురేష్ కు కేరళ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సహకరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు తీసిన అధికారులు అందులోని డబ్బులు, బంగారం చూసి వారి దిమ్మ తిరిగిపోయిందని తెలిసింది. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు సీజ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా అక్రమంగా సంపాధించిన డబ్బులు, బంగారాన్ని స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లలో దాచిపెట్టారని వెలుగు చూసింది.

 శివశంకర్ కు సినిమానే ?

శివశంకర్ కు సినిమానే ?

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యక్తిగత ప్రధాన కార్యదర్శిగా, ఆ రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసే సమయంలోనే ఐఏఎస్ అధికారి మేడమ్ స్వప్న సురేష్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న లేడీ కిలాడీతో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారు ? వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు ? అనే కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఐఏఎస్ అధికారి శివశంకర్ ను మరింత లోతుగా విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించాలని ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ అధికారులు సిద్దం అవుతున్నారని తెలిసింది.

Recommended Video

Top News Of The Day : China పై Donald Trump ఆగ్రహం.. చర్యలకు డిమాండ్! || Oneindia Telugu
 సాక్షులు ఎంత మంది అంటే !

సాక్షులు ఎంత మంది అంటే !

మొత్తం మీద మరోసారి ఐఏఎస్ అధికారి శివశంకర్ ను విచారణ చెయ్యాలని అధికారులు డిసైడ్ అయ్యారని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఈడీ అధికారులు కొచ్చి ప్రత్యేక కోర్టులో ఏకంగా 303 పేజీల చార్జ్ షీట్ దాఖలు చెయ్యడంతో ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు హడలిపోతున్నారు. 25 మంది సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు 303 పేజీల చార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారని వెలుగు చూసింది.

English summary
Gold smuggling case: The Enforcement Directorate (ED) on Wednesday submitted a chargesheet in connection with the high-profile Kerala gold smuggling case in a special (PMLA) court in Kochi and submitted that the role of M Sivasankar, former principal secretary to the Kerala Chief Minister's Office, needs to be thoroughly investigated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X