వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Gold Smuggling: జైల్లో స్వప్న మేడమ్ ఆడియో లీక్, కలకలం, సీఎంకు వ్యతిరేకంగా సాక్షం ?, డీజీపీ ఎంట్రీ!

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ తిరువనంతపురం/ న్యూఢిల్లీ: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విచారణ ఖైదీగా సెంట్రల్ జైల్లో ఉన్న స్వప్న సురేష్ అలియాస్ స్వప్న మేడమ్ ఆడియో లీక్ కావడంతో కలకలం రేపింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇస్తే తనను శిక్ష నుంచి తప్పిస్తామని, నువ్వు అలా చెయ్యాలని, లేదంటే జైల్లోనే ఉంటావని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED)అధికారులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని స్వప్న మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో రికార్డు కావడం, ఆ ఆడియో లీక్ కావడం కలకలం రేపింది.

ఆ మొబైల్ రికార్డింగ్ టేపులు బయటకు రావడంతో కేరళ ప్రభుత్వం ఉలిక్కిపడింది. స్వప్న సురేష్ జైల్లో మొబైల్ ఫోన్ లో ఎలా మాట్లాడింది ?, ఆ ఆడియో టేపులు ఎలా బయటకు వచ్చాయి ?, ఆమెకు ఎవరు సహాయం చేస్తున్నారు ? అంటూ దర్యాప్తు చెయ్యాలని జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆ రాష్ట్ర సౌత్ డివిజన్ డీఐజీ అజయ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు.

Hitech Sketch: ఫ్యామిలీ హైటెక్ వేశ్యవాటిక, గుంటూరు మిర్చి, నెల్లూరు నాటుకొడి, రాత్రి ఇది లెక్క!Hitech Sketch: ఫ్యామిలీ హైటెక్ వేశ్యవాటిక, గుంటూరు మిర్చి, నెల్లూరు నాటుకొడి, రాత్రి ఇది లెక్క!

సెంట్రల్ జైల్లో స్వప్న మేడమ్

సెంట్రల్ జైల్లో స్వప్న మేడమ్

అక్రమ బంగారు రవాణా (Gold Smuggling) కేసులో అరెస్టు అయిన స్వప్న సురేష్ అలియాస్ స్వప్న కేరళలోని తిరువనంతపురంలోని అత్తక్కులంగర మహిళా సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన కేసులో ఈడీ అధికారులు, కస్టమ్స్ అధికారులు స్వప్న సురేష్ ను అనేకసార్లు విచారణ చేసి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు.

జైల్లోకి కస్టమ్స్ అధికారులు ఎంట్రీ

జైల్లోకి కస్టమ్స్ అధికారులు ఎంట్రీ

బుధవారం మహిళా సెంట్రల్ జైలులో కస్టమ్స్ అధికారులు స్వప్న సురేష్ ను మరోసారి విచారణ చేసి వివరాలు సేకరించారు. సుమారు 6 గంటల సేపు స్వప్న సురేష్ ను కస్టమ్స్ అధికారులు విచారణ చేసి ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది. ఇదే సమయంలో స్వప్న సురేష్ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేపులు బయటకురావడంతో కేరళ ప్రభుత్వం, పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారు.

కేరళ సీఎంకు వ్యతిరేకంగా సాక్షం?

కేరళ సీఎంకు వ్యతిరేకంగా సాక్షం?

తిరువనంతపురం మహిళా సెంట్రల్ జైల్లో స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో టేపులు లీక్ కావడంతో వాటిని ఆన్ లైన్ మీడియా సంస్థ దిక్యూ బయటపెట్టింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని ,బంగారు స్మగ్లింగ్ తో ఆయనకు సంబంధం ఉందని మాకు స్టేట్ మెంట్ ఇవ్వాలని ఈడీ అధికారులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని స్వప్న సురేష్ చెప్పిందని ఆ ఆడియోలో ఉంది.

కేసు నుంచి తప్పిస్తామని హామీ?

కేసు నుంచి తప్పిస్తామని హామీ?

బంగారు స్మగ్లింగ్ తో సీఎం పినరయి విజయన్ కు సంబంధం ఉందని మాకు స్టేట్ మెంట్ ఇస్తే నిన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని ఈడీ అధికారులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ స్వప్న సురేష్ మాట్లాడింది. అంతే కాకుండా ఈడీ అధికారులు తయారు చేసిన స్టేట్ మెంట్ తాను పూర్తిగా చదవలేదని, తన మీద ఒత్తిడి చేసి బలవంతంగా తన సంతకం చేయించుకుని దానిని కోర్టులో సమర్పించారని ఆరోపిస్తూ స్వప్న సురేష్ మాట్లాడింది.

ఐఏఎస్ తో స్వప్న యూఏఇ టూర్

ఐఏఎస్ తో స్వప్న యూఏఇ టూర్

గత అక్టోబర్ నెలలో కేరళ సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారితో స్వప్న సురేష్ యూఏఇకి వెళ్లారు. ఆ సమయంలో కేరళ వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి విరాలు సేకరించడానికి తాను, ఐఏఎస్ అధికారి శివశంకర్ కలిసి యూఏఇ వెళ్లామని స్వప్న సురేష్ ఆమె న్యాయవాది సహాయంతో కోర్టుకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

Jagannanna Thodu : జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్..వారికి రూ. 10వేల ఆర్ధిక భరోసా!
ఏం జరిగింది ? స్వప్న ఎలా మాట్లాడింది

ఏం జరిగింది ? స్వప్న ఎలా మాట్లాడింది

బంగారు స్మగ్లింగ్ వ్యవహారం విషయంలోకే తాను యూఏఇకి వెళ్లానని, ఆ విషయం కేరళ సీఎంకు తెలుసని నువ్వు ఒప్పుకోవాలని, లేదంటే నీకు బెయిల్ రాకుండా చేసి నిన్ను జైలుకే పరిమితం చేస్తామని ఈడీ అధికారులు తన మీద ఒత్తిడి చేశారని స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావడం కలకలం రేపింది. మహిళా సెంట్రల్ జైల్లో స్వప్న సురేష్ మాట్లాడిన ఆడియో లేపులు ఎలా బయటకు వచ్చాయి, ఆమె మొబైల్ లో మాట్లాడటానికి ఎవరు సహాయం చేశారు ? అని విచారణ చెయ్యాలని కేరళ జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆదేశించారు. డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆదేశాలతో సౌత్ జోన్ డీఐజీ అజయ్ కుమార్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

English summary
Gold Smuggling Case: Swapna Suresh's leaked audio recording: Kerala Jail DGP Rishiraj Singh orders probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X