వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండ‌న్ లో కూడా లాగేస్తున్నారు..! బంగార‌మా మ‌జాకా...!!

|
Google Oneindia TeluguNews

లండన్‌/హైద‌రాబాద్ : భారతీయు మ‌హిళ‌లు మన దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్నా కూడా బంగారు న‌గ‌ల‌పై అపారమైన ఇష్టాన్ని కనబరుస్తారు. బంగారాన్ని ధరించడం శుభసూచికమని భావించే భారతీయులు ఎక్కుడ ఉన్నా న‌ల‌గ‌ల‌ను ధరించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పుడు ఇదే ఆచారం లండన్‌లోని భారతీయులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టింది. భారతీయులు బంగారాన్ని ధరించే ఆచారం లండన్‌లో స్థానిక దొంగలపాలిట వరంగా మారింది. దీంతో అక్కడ దొంగలు భారతీయులు, ఎన్‌ఆర్‌ఐల గృహాలే లక్ష్యంగా బంగారపు దొంగతనాలక దిగుతున్నారు. దీంతో లండ‌న్ లో ఉన్న భార‌తీయులు బెంబేలెత్తి పోతున్నారు.

 లండ‌న్ లో బంగారం దొంగలు..! భారతీయుల నివాసిత ప్రాంతాలే వారి టార్గెట్‌..!!

లండ‌న్ లో బంగారం దొంగలు..! భారతీయుల నివాసిత ప్రాంతాలే వారి టార్గెట్‌..!!

లండన్‌లో ఐదేండ్లలో 13 వేల కోట్ల మేర పసిడి చోరి జరిగిందని పోలీసు వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. చట్టాలు పటిష్టంగా ఉంటాయని చెప్పుకునే లండన్‌ లాంటి మహానగరాల్లో ఇలాంటి దొంగతనాలు గరిష్టంగా జరుగుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్‌లో నివాసం ఉంటున్న భారతీయులకు ఇటీవలి కంటినిండా నిద్ర కరువైంది. ఇందుకు కారణంగా ఇక్కడి భారతీయుల ఇండ్లే టార్కెట్‌గా తరుచూ బంగారం దొంగతనాలు జరగుతున్నాయి. స్థానిక పోలీసు అధికారులిచ్చిన గణాంకాల ప్రకారం, 2013 నుంచి 2018ల మధ్య కాలంలో లండన్‌లో 28 వేల దొంగతనాలు జరగ్గా, వీటిలో అత్యధికం భారతీయులు, భారత సంతతికి చెందిన వారే టార్గెట్‌గా జరిగినట్టుగా సమాచారం.

ఐదేండ్లలో 13వేల కోట్ల విలువైన పసిడి చోరీ..! భార‌తీయుల బంగారం సెంటిమెంటే కార‌ణం..!!

ఐదేండ్లలో 13వేల కోట్ల విలువైన పసిడి చోరీ..! భార‌తీయుల బంగారం సెంటిమెంటే కార‌ణం..!!

భారతీయుల ఇండ్ల నుంచి దొంగలు కొట్టేసిన బంగారం విలువ సుమారు 13వేల కోట్ల రూపాయ‌ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. భారతీయలు ఆభరణాలు ధరించటం సంప్రదాయంగా భావిస్తుండడం ఇక్కడి దొంగలకు వరంగా మారింది. దీంతో వారు బంగారం ఎక్కువగా ధరించే కుటుంబాలను టార్గెట్‌ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. బ్రిటిష్‌ పోలీస్‌ (స్కాట్‌ల్యాండ్‌ యార్డ్‌) నివేదిక ప్రకారం ఎక్కువ దొంగతనాలు గ్రేటర్‌ లండన్‌లో జరిగాయి. ఈ చోరీల్లో దొంగలు 958 కోట్ల విలువైన బంగారాన్ని దొంగలించారు. ఆ తర్వాత గ్రేటర్‌ మాంచెస్టర్‌ నగరంలో అత్యధికంగా చోరీలు నమోదు అయ్యాయి. ఇక్కడ జరిగిన దొంగతనాల్లో 871 కోట్ల విలువైన బంగారం చోరీ జరిగింది. దీంతో భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు. చేషాయర్‌లో భారతీయులు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు గస్తీని ఏర్పాటు చేశారు.

లండన్‌లోనే ఎక్కవ కేసులు..! భార‌తీయుల బంగారం సెంటిమెంటే కార‌ణం అంఉన్న పోలీసులు..!!

లండన్‌లోనే ఎక్కవ కేసులు..! భార‌తీయుల బంగారం సెంటిమెంటే కార‌ణం అంఉన్న పోలీసులు..!!

2017..18ల మధ్య 192 కోట్ల రూపాయ‌ల విలువ చేసే 3,300 చోరీలు జరిగాయి. కెన్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 145 కోట్ల రూపాయ‌ల‌ మేర 89 దొంగతనాలు జరిగాయన్నారు. మాంచెస్టర్‌ పోలీసుల నివేదిక ప్రకారం 136 కోట్ల రూపాయ‌ల ఖరీదైన బంగారాన్ని దొంగలు కాజేసినట్టు 238 చోరీ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఏటా దీపావళి, నవరాత్రి లాంటి పెద్ద పండుగలు వచ్చినపుడు బ్రిటన్‌లో ఉండే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నామని స్కాట్‌ల్యాండ్‌ యార్ట్‌ పోలీసులు వివరించారు.

రుణాలిప్పిస్తామంటూ మోసం, 100 కోట్లకు శఠగోపంరుణాలిప్పిస్తామంటూ మోసం, 100 కోట్లకు శఠగోపం

 పండుగ‌ల‌ప్పుడు భార‌తీయులు జాగ్ర‌త్త‌గా ఉండాలి..! అతిగా బంగారం ధ‌రించొద్దంటున్న పోలీసులు..!!

పండుగ‌ల‌ప్పుడు భార‌తీయులు జాగ్ర‌త్త‌గా ఉండాలి..! అతిగా బంగారం ధ‌రించొద్దంటున్న పోలీసులు..!!

భారతీయలు ఆభరణాలు ధరించటం సంప్రదాయంగా భావిస్తుండడం దొంగలకు వరంగా మారిందని సౌత్‌హాల్‌లోని ఏషియాడ్‌ బులియన్‌ మార్కెట్‌ వ్యాపారి సంజరు కుమార్‌ తెలిపారు. ఈ సమయంలో దొంగలు అత్యధికంగా బంగారం ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకొని.. తరువాత కాలంలో దొంగతనాలకు పాల్పడుతన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఎన్నో నిఘా వ్యవస్థలు ఉండి కూడా బంగారు దొంగల్ని అక్కడి పోలీసు వ్యవస్థ కట్టడి చేయలేకపోవటంపై భారతీయుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Indians who feel that wearing gold are auspicious, but they tend to be interested in wearing gold. Now this practice has brought new challenges to the Indians in London. The custom of the Indians wearing gold was the local stolen in London. This is where thieves are Indians and NRI households targeted for gold stolen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X