అనంత పద్మనాభూడి ఆలయంలో రూ.186 కోట్ల బంగారం మాయం!
తిరువనంతపురం: కేరళలోని అనంత పద్మనాభం ఆలయంలో రూ.186 కోట్ల విలువ చేసే బంగారం మాయమైనట్లుగా చెబుతున్నారు. అనంత పద్మనాభ స్వామి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవుడిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
పద్మనాభుడి ఖజానా నుంచి రూ. 186 కోట్ల విలువైన 769 బంగారు కుండలు అదృశ్యమైనట్టు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మాజీ ఫైనాన్షియల్ కార్యదర్శి వినోద్ రాయ్ సుప్రీం కోర్టుకు తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇవి మాయమయ్యాయన్నారు.

ఈ బంగారు కుండలకు సీరియల్ నంబర్ 1 నుంచి 1988 వరకూ ఇచ్చారని, అందులో ప్రస్తుతం 397 మాత్రమే ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. ఆలయ కమిటీల లెక్కల ప్రకారం.. వీటిల్లో 822 బంగారు కుండలను ఆభరణాల కోసం కరిగించినట్టు ఉందని, వాటిని తొలగిస్తే 1,166 బంగారు కుండలు ఉండాల్సి ఉందన్నారు. ఆలయ కమిటీ బలహీనంగా ఉందని, దాన్ని తొలగించాలని సూచించారు. ఈ నివేదికపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications