వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు మోడీ సర్కారు గుడ్‌న్యూస్: ఆరు పంటల కనీస మద్దతు ధర పెంపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (MSPs) మంగళవారం (అక్టోబర్ 18) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధరలు) పెంపు నిర్ణయం తీసుకున్నారు.

2022-23 పంట సంవత్సరం (జూలై-జూన్), 2023-24 మార్కెటింగ్ సీజన్‌లో ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌ పంటలు పండిన వెంటనే అక్టోబర్‌ నుంచి రబీ పంటల నాట్లు ప్రారంభమవుతాయి. గోధుమ, ఆవాలు ప్రధాన రబీ పంటలు. వీటితోపాటు మసూర్, బార్లీ, కుసుమ పంటల ఎంఎస్పీ పెంచారు.

 Good news for farmers: Modi govt hikes MSP for wheat and other 6 rabi crops

కేంద్రం పెంచిన కనీస మద్దతు ధరలు ఇలా..

బార్లీ ధరను రూ. 100 పెంచడంతో క్వింటాల్ ధర రూ. 1735కు పెరిగింది.
శనగల కనీస మద్దతు ధరను రూ. 5230 నుంచి రూ. 5335కి పెంచారు.
మసూర్ పంట మద్దతు ధరను రూ. 500 పెంచడంతో క్వింటాల్ ధర రూ. 6000కు చేరింది.
ఆవాల కనీస మద్దతు ధరను రూ. 5050 నుంచి రూ. 5450కు పెంచారు.
గోధుమలకు కనీస మద్దతు ధరను రూ. 110 పెంచారు. దీంతో క్వింటాల్ ధర రూ. 2,125కు చేరింది.
కుసుమ పంట మద్దతు ధరపై రూ. 209 పెంచారు. దీంతో క్వింటాల్ ధర రూ. 5650కి పెరిగింది.

English summary
Good news for farmers: Modi govt hikes MSP for wheat and other 6 rabi crops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X