మళ్లీ పెళ్లి చేసుకున్న సుందర్ పిచాయ్ మామ
కోట: గూగుల్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి సుందర్ పిచాయ్ మామయ్య ఓలారామ్ హర్యానీ (70) మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని ఆర్య సమాజ కార్యాలయంలో ఆ సంస్థ ఆచారాలకు అనుగుణంగా మంగళవారం మాధురి శర్మ(65)ను ఆయన తన 70వయేట వివాహం చేసుకున్నారు.

మాధురీ శర్మ రాజస్థాన్‌లోని కోట నివాసి. ఆమె భర్త మిలటరీలో పని చేసే వారు. ఆయన గతంలోనే మరణించారు. కాగా, ఓలారామ్ కోటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. అనంతరం ఆయన ముంబైలో నివసిస్తున్నారు.
ఓలారామ్‌కు ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. వీరిద్దరూ విదేశాల్లోనే టున్నారు. కాగా, ఓలారామ్ కుమార్తె అంజలినే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వివాహం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications