అందంగా లేనని మూడేళ్లలో మూడుసార్లు ఆత్మహత్యాయత్నం..

సోషల్ మీడియా ఫిల్టర్ల మాయలో పడి నేటి యువత తమ సహజ అందాన్ని మర్చిపోతోంది. బయటి ప్రపంచం ఎంత మెచ్చుకున్నా, అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని లేనిపోని లోపాలను వెతుక్కుంటూ మానసిక కుంగుబాటుకు లోనవుతోంది. అచ్చం ఇలాంటి ఒక వింత మానసిక సమస్యతో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల నీట్ విద్యార్థిని నరకయాతన అనుభవించింది. తాను అందంగా లేనన్న ఒకే ఒక్క ఆలోచన ఆమెను ఏకంగా మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసేలా ప్రేరేపించింది.

అద్దం చూస్తేనే భయం.. అదృష్టం కొద్దీ బతికింది!

"నన్ను చూసిన వారంతా నువ్వు చాలా అందంగా ఉన్నావని చెబుతారు. కానీ అద్దం ముందు నిలబడితే మాత్రం నాకు ఒక వికారమైన రూపమే కనిపిస్తుంది. ఈ బాధ తట్టుకోలేక ఇప్పటివరకు మూడుసార్లు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాను.. కానీ ప్రతిసారీ అదృష్టం నన్ను బతికించింది" అంటూ ఆ విద్యార్థిని తన సైకాలజిస్ట్ వద్ద కన్నీటిపర్యంతమైంది. ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు సాధించి, డాక్టర్ కావాలనే లక్ష్యంతో నీట్‌కు సిద్ధమవుతున్న ఆమెను ఈ మానసిక వేదన తీవ్రంగా కుంగదీసింది.

Gorakhpur NEET Aspirant Attempts Suicide Thrice Over Body Image Issues Diagnosed With Dysmorphic Disorder
NEET PG: హైదరాబాద్ లో తీవ్ర విషాదం.. పరీక్షకు ఒక్క రోజు ముందు నీట్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య
NEET PG: హైదరాబాద్ లో తీవ్ర విషాదం.. పరీక్షకు ఒక్క రోజు ముందు నీట్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య

క్లాస్ రూమ్‌లో చివరి బెంచీకే పరిమితం

ఉదయం నిద్రలేచి అద్దం ముందు నిలబడినప్పటి నుంచే ఆమెకు నరకం మొదలయ్యేది. తన ముక్కు వంకరగా ఉందని, ముఖం అస్సలు బాగోలేదని, పొట్ట ముందుకు వచ్చిందని, జుట్టు కూడా అందంగా లేదని ఆమె తీవ్రంగా మదనపడేది. ఈ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి మేకప్ వేసుకోవడం, ఫోన్‌లో ఫిల్టర్లు పెట్టి ఫొటోలు తీసుకోవడం అలవాటు చేసుకుంది. కాలేజీకి వెళ్తే తోటి విద్యార్థులంతా తన లోపాలను చూసి నవ్వుతున్నారేమోనన్న భయంతో ఎవరి కంటా పడకుండా క్లాస్ రూమ్‌లో చివరి బెంచీలో కూర్చునేది. గ్రూప్ ఫొటోలు దిగేటప్పుడు కూడా తన ముఖాన్ని దాచుకునే స్థితికి వెళ్లిపోయింది.

అసలు సమస్య 'బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్'

తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి పరిపాలనా విభాగంలో ఉన్నత ఉద్యోగి. ఎంతో ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు, మంచి స్నేహితులు ఉన్నప్పటికీ ఆమె ఒంటరితనంతో కుమిలిపోయేది. గత రెండేళ్లలో మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేయడంతో పాటు, ఒకసారి చేయి కూడా కోసుకుంది. కాన్పూర్, గోరఖ్‌పూర్‌లలో ఎందరో వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవడంతో, ఈ ఏడాది ఏప్రిల్‌లో తల్లిదండ్రులు ఆమెను ఒక సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. కౌన్సెలింగ్ నిర్వహించిన వైద్యుడు, ఆమె 'బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్' (తమ శరీర ఆకృతిలో లేని లోపాలు ఉన్నాయని భ్రమపడే మానసిక వ్యాధి) తో బాధపడుతున్నట్లు గుర్తించారు.

నల్లగా ఉన్నావ్, నా అందం వాడికే దక్కాలి.. ప్రియుడితో కలిసి భర్తను
నల్లగా ఉన్నావ్, నా అందం వాడికే దక్కాలి.. ప్రియుడితో కలిసి భర్తను

సరైన చికిత్సతో మళ్లీ సాధారణ స్థితికి..

సమస్య మూలాన్ని గుర్తించిన సైకాలజిస్ట్, ఆమెకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) ద్వారా చికిత్స అందించడం ప్రారంభించారు. గత ఏడు నెలలుగా నిరంతరం సాగిన కౌన్సెలింగ్, సరైన మానసిక చికిత్స కారణంగా ఇప్పుడు ఆ విద్యార్థినిలో ఎంతో మార్పు వచ్చిందని, ఆమె తిరిగి సాధారణ జీవితంలోకి అడుగుపెడుతోందని వైద్యులు తెలిపారు. యువత ఇలాంటి మానసిక సమస్యలను దాచుకోకుండా నిపుణుల సాయం తీసుకోవాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+