అరెస్టు చేసినా తలవంచను: బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని బలవంతం చేసినట్లు వ్యాఖ్యానించారు. తనను జైలుకు పంపినా తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఆగవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పాఠశాలల నిర్మాణం, ప్రజలకు ఉచిత వైద్యం అందించడం వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ నిలిచిపోవని చెప్పారు.

ఢిల్లీలోని కిరారీలో రెండు పాఠశాలల భవనాలకు శంఖుస్థాపన చేసిన సందర్భంగా కేజ్రీవాల్​ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలు కట్టినందుకే మనీశ్​ సిసోడియాను జైలులో పెట్టారని, మొహల్లా క్లినిక్​లు కట్టినందుకే సత్యేందర్ జైన్‌​ను కారాగారానికి పంపించారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తాము బీజేపీలో చేరాలని ఆ పార్టీ కోరుకుంటోందని.. కానీ, తాము తలవంచమని కేజ్రీవాల్​ అన్నారు.

 Got Offer From BJP, Will Never Join: Delhi CM Arvind Kejriwal.

ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆప్​ నేతలపైకి ఉసిగొల్పారని కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా, ఢిల్లీ మంత్రి ఆతిశీకి నోటీసులు ఆప్‌ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందన్న ఆరోపణల కేసులో నోటీసులు అందించేందుకు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆదివారం మంత్రి ఆతిశీ ఇంటికి వచ్చారు. అయితే ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నోటీసులు అందజేయడానికి మరోసారి వస్తామని చెప్పారు.

కానీ, తమ కార్యాలయ సిబ్బందికి ఆ నోటీసులు అందించాలని ఆతిశీ కోరినా.. పోలీసులు నిరాకరించినట్లు సమాచారం. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా సీఎం కేజ్రీవాల్‌కు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం నోటీసు అందజేశారు. ఆరోపణలకు సంబంధించి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు. దీంతోపాటు బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపిన ఆప్‌ శాసనసభ్యుల పేర్లను వెల్లడించాల్సిందిగా కోరారు. కాగా, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని జనవరి 27న కూడా సీఎం కేజ్రీవాల్, మంత్రి అతీశీ ఆరోపించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+