రూ.10 నాణేలకు దిక్కులేదు.. ఇక రూ.20 కాయిన్లు రాబోతున్నాయ్

Recommended Video

    Finance Ministry Issues Notification For Minting Of ₹20 Coins | Oneindia Telugu

    న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్తగా 20 రూపాయల నాణేలు చలామణిలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ నాణేలు ముద్రణా దశలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 20 రూపాయల నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు ముద్రిస్తోందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నాణేలు చలమాణిలోకి వచ్చిన తరువాత చిల్లర కష్టాలు తీరుతాయని చెబుతున్నారు.

    ఇదివరకు 10 రూపాయల నాణేలు చలామణిలో ఉండేవి. సుమారు రెండేళ్లుగా ఈ నాణేలు ఎక్కడా చెల్లుబాటు కావట్లేదు. 10 రూపాయల నాణేలను రిజర్వుబ్యాంకు నిషేధించిందనే వార్తలు అనధికారికంగా వెలువడ్డాయి. దీనితో ఆ కాయిన్లు మూలన పడ్డాయి. 10 రూపాయల కాయిన్ సహా ప్రస్తుతం చలమాణిలో 14 రకాల డినామినేషన్ గల నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయని రిజర్వుబ్యాంకు చెబుతోంది. అయినప్పటికీ.. 10 రూపాయల కాయిన్ ను క్రయ, విక్రయాల్లోకి వినియోగించట్లేదు జనం.

    Government announces new Rs 20 coin

    అదే సమయంలో- కొత్తగా 20 రూపాయల నాణేలను చలమాణిలోకి తీసుకుని రావడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ డినామినేషన్ కావడం వల్ల 10 రూపాయల కాయిన్లను చలామణిలోకి తీసుకుని రావాలని కోరుకునే వారు చాలామందే ఉన్నారు.

    కొత్తగా రాబోయే 20 రూపాయల నాణేం కూడా.. అచ్చ 10 రూపాయల కాయిన్ లాగే ఉంటుంది. ఈ నాణేం డయా 27 మిల్లీమీటర్లుగా నిర్ధారించారు. రెండు లోహాలతో దీన్ని తయారు చేస్తారు. బాహ్య వలయాన్ని రాగితోనూ, అంతర్గత వలయాన్ని జింక్, నికెల్ తోనూ తయారు చేస్తారు. ఇందులో రాగి 65 శాతం, జింక్ 15 శాతం, నికెల్ 20 శాతం మేర మిశ్రమాన్ని వినియోగిస్తారని ఆర్థికశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ లో పొందుపరిచారు. 2009లో తొలిసారిగా రిజర్వుబ్యాంకు 10 రూపాయల కాయిన్లను చలామణిలోకి తీసుకొచ్చింది. సరిగ్గా పదేళ్ల తరువాత 20 రూపాయల నాణేల తయారీకి ఉపక్రమించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+