పిల్లలకు బండిస్తే పేరెంట్స్‌కు జైలు.. తాగి నడిపితే రూ.పదివేలు ఫైన్..
Recommended Video
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మోటార్ వాహనాల చట్టం సవరణ బిల్లు 2019తో పాటు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు 2019కు ఆమెదం తెలిపింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించేలా బిల్లులో సవరణలు చేశారు. లైసెన్స్ లేకుండా బండి నడపడం, డ్రంకన్ డ్రైవ్ కేసులకు సంబంధించి పెనాల్టీ మొత్తాన్ని భారీగా పెంచారు.

సీట్ బెల్ట్ లేకుండా లైసెన్స్ రద్దు
కొత్త చట్టం అమల్లోకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఇప్పటి వరకు విధిస్తున్న రూ.500 ఫైన్ రూ.5వేలకు పెరగనుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై అతివేగంతో వెళ్లే వాహనదారులకు వెయ్యి నుంచి 2వేల రూపాయలు జరిమానా విధించేలా నిబంధనలు కఠినతరం చేశారు. ఇక ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2వేలు, సీటు బెల్టు, హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేస్తే రూ.వెయ్యి జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌కు రూ.5వేలు వసూలు చేయనున్న ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ10,000 జరిమానా కట్టేలా నిబంధనలు కఠినతరం చేశారు.

మైనర్లకు బండి ఇస్తే పేరెంట్స్‌కు శిక్ష
మైనర్లు బండ్లు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు తగ్గించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇకపై మైనర్లకు బండి ఇచ్చిన వారికి రూ. 25 వేల ఫైన్, మూడేళ్ల జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. అంబులెన్స్, ఇతర అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వారికి రూ.10,000ల ఫైన్ విధిస్తారు. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ సిబ్బంది ఉల్లంఘిస్తే
ఓవర్ లోడింగ్‌తో వెళ్లే వాహనాలకు రూ.20 వేల పెనాల్టీ విధించాలని కొత్త వాహన చట్టం నిబంధనల్లో మార్పు చేశఆరు. ఓలా, ఉబెర్ తదితర ఎగ్రిగేటర్లకు ఇప్పటి వరకు ఇస్తున్న మినహాయింపును ఎత్తివేయనున్నారు. ఆయన ట్యాక్సీల డ్రైవర్లు లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడితే లక్ష రూపాయలు జరిమానా విధించేలా చట్టంలో మార్పు చేశారు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు ఇవే ఉల్లంఘనలకు పాల్పడితే రెట్టింపు జరిమానా వసూలు చేసేలా నిబంధనలు కఠినతరం చేశారు.












Click it and Unblock the Notifications