Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ola News: 'ఓలా' కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. ప్రభుత్వం సీరియస్ వార్నింగ్‌.. రీఫండ్ ముసుగులో దందాకు చెక్..

Cab bookings: రైడ్ హెయిలింగ్ సంస్థల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతోంది. టెక్నాలజీ సపోర్ట్ ఇస్తూ, అసలు సొంత వాహనాలు లేకుండానే సదరు కంపెనీలు కోట్ల టర్నోవర్‌ను సాధిస్తున్నాయి. అధిక కమీషన్లు వసూలు చేస్తూ అటు డ్రైవర్లను, ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ ఇటు ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి సంస్థలపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా ప్రభుత్వం ఓలాకు గట్టి షాక్ ఇచ్చింది.

భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని క్యాబ్ అగ్రిగేటర్ ఓలాకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. కస్టమర్‌లు తమకు నచ్చిన రీఫండ్ పద్ధతిని ఎంచుకునే విధంగా ఒక మెకానిజంను అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) స్పష్టంగా పేర్కొంది. ఓలా ప్లాట్‌ఫారమ్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఆటో రైడ్‌కు బిల్లు, రసీదు లేదా ఇన్‌వాయిస్‌ను అందించాలని సూచించింది.

Government big shock to Ola by ordering to provide alternative refund mechanism

నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) డేటా ప్రకారం ఓలాపై ఈ ఏడాది ప్రారంభం నుంచి నుంచి అక్టోబర్ 9 వరకు 2 వేలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. బుకింగ్ సమయంలో చూపించిన దాని కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం, రీఫండ్‌లను అందించడంలో వైఫల్యం మరియు డ్రైవర్ల ప్రవర్తన, సరైన ప్రదేశానికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు, ప్రయాణీకులను తప్పుడు గమ్యస్థానానికి చేర్చడం వంటివి ఎక్కువగా ఉన్నాయి.

వీటికి అదనంగా ఫిర్యాదుల పరిష్కార సమయంలో ఓలా రీఫండ్ మొత్తాన్నికూపన్‌లుగా వినియోగదారులకు అందిస్తోంది. దీన్ని CCPA తప్పు పట్టింది. సదరు మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడే విధంగా కస్టమర్లకు ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలని ఆదేశించింది. కూపన్ రూపంలో రీఫండ్ ఇవ్వడం ద్వారా ప్రయాణీకులు మరోసారి తప్పకుండా తమ ప్లాట్‌ఫారమ్‌ను వినియోగించేలా ఓలా ప్రలోభానికి గురిచేస్తోందని గుర్తించింది. అందుకే ఈ వ్యవహారంపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+