సర్కారు భోజనం మాకొద్దు, కమ్యూనిటీ కిచెన్‌లో వండుకొచ్చాం.. కేంద్రమంత్రులు కూడా రైతుల ఆహారాన్నే..
వ్యవసాయ రంగంలో గొప్ప సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు 35వ రోజు కూడా కొనసాగాయి. సమస్య పరిష్కారం దిశగా రైతు సంఘాల నేతలతో పలువురు కేంద్ర మంత్రులు బుధవారం చర్చలు జరిపారు. కేంద్రం, రైతుల మధ్య ఆరో రౌండ్ చర్చల సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
చట్టాల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ, లంచ్ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారాన్ని తీసుకునేందుకు రైతులు నిరాకరించారు. స్థానిక గురుద్వారాలోని లంగర్ (కమ్యూనిటీ కిచెన్) లో వండి తెచ్చుకున్న భోజనాన్నే రైతులు తిన్నారు. రైతు సంఘాల నేతలు నేలపైనే కూర్చొని భోజనం లాగించేశారు. దీంతో..

కేంద్రం మంత్రులు సైతం రైతులను ఫాలో కాక తప్పలేదు. రైతులు వెంట తెచ్చుకున్న ఆహారాన్నే కేంద్రమంత్రులు పియూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమార్ ఆరగించారు. చర్చలు జరిగిన ప్రతిసారి రైతులు కేంద్రం వైఖరికి నిరసనగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన లంచ్‌ను తిరస్కరిస్తున్న విషయం తెలిసిందే.

చర్చలు జరుగుతున్న విజ్ఞాన్ భవన్ వెలుపల నుంచి ''కరసేవ వాహనాన్ని'' ద్వారా రైతులు ఆహారం తెచ్చుకుంటున్నారు. ఇంతకు ముందు జరిగిన చర్చల్లో కూడా రైతులు ప్రభుత్వ లంచ్‌ను తిరస్కరించి, తమ సొంత ఆహారం భుజించారు. విజ్ఞాన్ భవన్ వెలుపల నేలమీద కూర్చుని రైతు నేతలు లంచ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. కాగా,

ఇంకా రైతులతో చర్చల్లో.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తేలేదని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రైతులు ఆందోళన విరమించాలని, పంటలకు మద్దతుధరపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పినట్లు సమాచారం. ఆందోళన సందర్భంగా చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని చర్చల సందర్భంగా రైతులు సంఘాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చర్చలు ఇంకా కొనసాగుతున్నందున తుది ఫలితం ఏమిటన్నది ఇంకాసేపట్లో తేలనుంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications