సీబీఐ చేతికి రవి కేసు: మనస్సు మార్చుకున్న సిద్దు, సోనియా ఒత్తిడే?

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. రవి మరణించిన తరువాత కేసు దర్యాప్తు సిబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చెయ్యడం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెనక్కి తగ్గారు. సోమవారం శాసన సభలో రవి కేసు సీబీఐకి అప్పగిస్తామని స్వయంగా సిద్దరామయ్య ప్రకటించనున్నారు.

కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించడం ఉత్తమం అని సిద్దరామయ్య బావించారు. శుక్రవారం రాత్రి సీఎం సిద్దరామయ్య తీరిక లేకుండా సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, న్యాయనిపుణులతో చర్చించారు. రవి కేసు విషయంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రవి కేసు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయని అధికారులు సీఎం సిద్దరామయ్యకు చెప్పారు.

కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ రావడంతో వెనక్కు తగ్గకుండా మొండి పట్టు పట్టిన సిద్దరామయ్య చివరికి ఆయన తన నిర్ణయం మార్చుకున్నారు. ఇలాంటి సమయంలో కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించకుంటే లేని పోని సమస్యలు వస్తాయని సోంత పార్టీ నాయకులు సిద్దరామయ్యకు నచ్చ చెప్పారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒత్తిడి మేరకే సిద్ధరామయ్య మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.

Government to hand over IAS officer DK Ravi's case to CBI

ఒక్కరిని నమ్ముకుని కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించకుంటే మీ సీటుకు ఎసరు వస్తుందని ఆయన సన్నిహితులు సిద్దరామయ్యకు చెప్పారు. చాల రోజుల నుండి మిమ్మల్ని తప్పించి వేరే వారిని సీఎం చెయ్యాలని బావిస్తున్న సోంత పార్టీ నాయకులు చాప కింద నీరులా అధిష్టానానికి ఎప్పటి కప్పుడు సమాచారం అందిస్తు ఫిర్యాదులు చేస్తున్నారని సిద్దరామయ్య దృష్టికి తీసుకు వెళ్లారు.

అన్ని విషయాలు చర్చించిన తరువాత సీఎం సిద్దరామయ్య సీఐడి అధికారులను సంప్రదించారు. కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది అని అడిగి తెలుసుకున్నారు. సీఐడి అధికారులతో చర్చించిన తరువాత సిద్దరామయ్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని, ఇప్పుడైన సరైన నిర్ణయం తీసుకున్నారని సీఎం సిద్దరామయ్య సన్నిహితులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+