త్వరలో కేంద్రం సంచలన నిర్ణయం: అక్రమ పార్కింగ్‌కు తప్పదిక భారీ మూల్యం

అక్రమంగా పార్కింగ్ చేసే వాహనాలకు ఇకనుంచి రూ.1000 జరిమానా విధించే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్టు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకోబోనున్న కొత్త నిర్ణయం వాహనాదారులకు దడ పుట్టించేదిగా ఉంది. రోడ్డుపై అక్రమంగా పార్కింగ్ చేసే వాహనాలకు ఇకనుంచి రూ.1000 జరిమానా విధించే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్టు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

కాగా, అక్రమ పార్కింగ్ కు ప్రస్తుతం రూ.200 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జరిమానాను వెయ్యి రూపాయలకు పెంచే విషయమై నిర్ణయం తీసుకోబోతున్నట్టు స్మార్ట్ నాగ్‌పూర్ సిటీ సదస్సులో కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.

Government making policy to raise illegal parking fine Nitin Gadkari

రోడ్లపై అక్రమంగా పార్కింగ్ చేసే వాహనాలను ఎవరైనా తమ కెమెరా ద్వారా ఫోటో తీసి రవాణాశాఖకు పంపించవచ్చునని ఈ సందర్బంగా గడ్కరీ తెలియజేశారు. పార్కింగ్ సౌకర్యం లేని భవనాలకు ఇకనుంచి అనుమతులు మంజూరు చేయవద్దని మహారాష్ట్ర ప్రభుత్వానికి గడ్కరీ విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+