teachers: మోదీ కేర్ వ్యాపారం చేసిన స్కూల్ టీచర్ల, దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగాలు ?, గోవింద !

బెంగళూరు/చిత్రదుర్గ: అత్యాశకు వెళ్లిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అనధికారికంగా ప్రైవేటు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారం చేసే కొందరు ఉపాధ్యాయులు విదేశీ వస్తువులను స్వదేశీ వస్తువులు అని నమ్మించి అమాయకులకు అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు వ్యాపారం చేస్తున్న కంపెనీ పెట్టిన పేరు అలాంటిది. ప్రధాని నరేంద్ర మోదీ పేరు కలిసి వచ్చేలా ఆ కంపెనీ నిర్వహకులు ఆ కంపెనీ పేరును మోదీకేర్ అని పెట్టి ప్రజలను మోసం చేశారు. మోదీకేర్ దెబ్బతో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఊడిపోయాయి.

 ప్రధాని మోదీకి చెడ్డపేరు తెస్తున్నారు

ప్రధాని మోదీకి చెడ్డపేరు తెస్తున్నారు

మోదీ కేర్ అనే చీటింగ్ కంపెనీలో వ్యాపారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పేరును చెడగొడుతున్నారని కొందరు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వారిపై సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ అధికారులకు మనవి చేశారు. దీనిపై కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌, డైట్‌ ప్రిన్సిపాల్‌, డీడీపీఐ సంయుక్తంగా దర్యాప్తు చేశారు.

 ప్రభుత్వ స్కూల్ టీచర్లు

ప్రభుత్వ స్కూల్ టీచర్లు

మోదీ కేర్ పేరుతో ప్రైవేట్ వ్యాపారం చేస్తున్న 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. వీరిలో 8 మంది ఉపాధ్యాయులు వ్యాపారం చేసినవారే కావడం విశేషం. అడిగిన సమాచారం మేరకు స్పందించకపోవడంతో విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ విద్యాశాఖ డీడీపీఐ బుధవారం చిత్రదుర్గాలో మీడియాకు చెప్పారు.

 చైన్ లింక్ వ్యాపారం చేస్తున్న టీచర్లు

చైన్ లింక్ వ్యాపారం చేస్తున్న టీచర్లు

చిత్రదుర్గ జిల్లాలో 500 మందికి పైగా ఉపాధ్యాయులు మోదీ కేర్ చైన్ లింక్ వ్యాపారంలో పాల్గొంటున్నారని వెలుగు చూసింది. తమ వృత్తిని అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక్కో టీచర్ నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు కమీషన్ తీసుకుంటూ ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నారని. స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పకుండా వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 సార్ల ఉద్యోగాలు ఊస్ట్ ?

సార్ల ఉద్యోగాలు ఊస్ట్ ?

పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా మోదీ కేర్ చైన్ లింక్ వ్యాపారంలో పాలుపంచుకుంటూ తమ టీచర్ వృత్తిని దుర్వినియోగం చేస్తూ వ్యాపారాలు చేస్తున్నారని కర్ణాటక విద్యాశాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఆర్థిక ప్రయోజనాల కోసం కొందరు ఉపాధ్యాయులు మోదీకేర్ అనే చైన్ లింక్ ప్రైవేట్ వ్యాపారం చేశారు. అయితే ఇప్పుడు అదే ఉపాధ్యాయులు వారి ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి క్యూలో నిలబడి ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. మోదీ పేరుతో చైన్ లింక్ చీటింగ్ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగాలు పీకేయాడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+