వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాసేపట్లో గవర్నర్ కీలక ప్రకటన: ఉత్కంఠలో పన్నీర్, శశికళ!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడులో నాటకీయ పరిణామాలు క్లైమాక్స్ కు చేరాయి. కాసేపట్లో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు కీలక ప్రకటన చెయ్యనున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే. రాజేంద్రన్ తో చర్చలు జరిపారు.

<strong>శశికళ మైండ్ గేమ్, పన్నీర్ సెల్వంకు చెక్ పెట్టేందుకే, వేటు పడింది</strong>శశికళ మైండ్ గేమ్, పన్నీర్ సెల్వంకు చెక్ పెట్టేందుకే, వేటు పడింది

శుక్రవారం మద్యాహ్నం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ను రాజ్ భవన్ కు పిలిపించుకుని ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ఏర్పాటు విషయంపై చర్చించారు.

Governor CH. Vidyasagar Rao held discussions with Chief Secretary Girija Vaidhyanathan at Raj Bhavan.

ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకు వెళ్లిన శశికళ వర్గం వారిని నిర్బంధించారని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు డీజీపీ టీకే. రాజేంద్రన్ ఎమ్మెల్యేలను తీసుకుని రాజ్ భవన్ చేరుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

<strong>చిన్నమ్మకు ఝలక్: శశి వర్గం ఇచ్చిన సంతకాలు సరిచూడాలి, గవర్నర్</strong>చిన్నమ్మకు ఝలక్: శశి వర్గం ఇచ్చిన సంతకాలు సరిచూడాలి, గవర్నర్

ఎమ్మెల్యేలతో మాట్లాడిన తరువాత గవర్నర్ ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. గవర్నర్ నిర్ణయం కోసం పన్నీర్ సెల్వం, శశికళ వర్గంతో పాటు ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీతో సహ తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుకు మనవి చేశారు. ప్రజల్లో శశికళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని దేశం మొత్తం ఆసక్తి ఎదరు చూస్తోంది

English summary
Governor CH. Vidyasagar Rao held discussions with Chief Secretary Girija Vaidhyanathan and Director-General of Police T. K. Rajendran at Raj Bhavan on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X