మేలుకోటేలో గవర్నర్ నరసింహన్, ఎన్నో ఏళ్ల నుంచి రావాలని ఆశ, కానీ ఈ రోజు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీ సమేతంగా మేలుకోటేలోని శ్రీ చెలువరాయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీచెలువరాయస్వామి, భగవద్ రామానుజాచార్యుల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సోమవారం గవర్నర్ నరసింహన్ దంపతులకు మేలుకోటేలో శ్రీ చెలువరాయస్వామి ఆలయం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చెలువరాయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు.

Anddhra Pradesh and Telangana Governor Ekkadu Srinivasan Lakshmi Narasimhan in Mysuru.

ఏన్నో సంవత్సరాల నుంచి మేలుకోటే ఆలయం దర్శించాలని అనుకుంటున్నానని, అయితే ఇప్పటికి వీలుకలిగిందని అన్నారు. చెలువరాయస్వామిని దర్శించుకోవడం నా అదృష్టం అని అన్నారు. ఉపనయనం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తాను మేలుకోటే వచ్చి దైవదర్శనం చేసుకున్నానని గవర్నర్ నరసింహన్ చెప్పారు.

సోమవారం ఉదయం 8 గంటల సమయంలో శ్రీరంగపట్టణంలోని శ్రీ రంగనాథస్వామి, నిమిషాంభాదేవి దర్శనం చేసుకున్న తరువాత గవర్నర్ నరసింహన్ కుటుంబ సభ్యులతో కలిసి మేలుకోటే చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ బస చెయ్యడానికి మైసూరులో కర్ణాటక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anddhra Pradesh and Telangana Governor Ekkadu Srinivasan Lakshmi Narasimhan in Mysuru.
Please Wait while comments are loading...