మిజోరం అసెంబ్లీ పోలింగ్: ఓటు హక్కు వినియోగించుకున్న కంభంపాటి హరిబాబు
మిజోరం అసెంబ్లీ పోలింగ్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. అధికార పార్టీని ఎన్నుకుంటోన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ, మిజోరంలో ఒకే విడతలో ఈ పోలింగ్ పూర్తవుతుంది.
ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటోన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్‌ను నిర్వహించింది.

40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ ముగుస్తుంది. ఎనిమిది లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వారికోసం 1,276 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు అధికారులు. ముఖ్యమంత్రి జోరమ్ థంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజధాని ఐజ్వాల్ నార్త్-2 నియోజకవర్గంలోని వైఎంఏ హాల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరించారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. పారా మిలటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్రీయ రిజర్వ్ పోలీస్ దళాలను రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు.
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి కిందటే రాజధాని ఐజ్వాల్‌లో ఆయన ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో పోలింగ్ ప్రక్రియను అతిపెద్ద పండగగా అభివర్ణించారు. ఈ పండగలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మిజోరం అక్షరాస్యత అధికంగా ఉన్న ఉన్న రాష్ట్రం అని, తమ హక్కులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. మిజోరాం ప్రజలందరూ ఓటు వేసి ఎన్నికల్లో పాల్గొనాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఓటింగ్ శాతం అధికంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications