అపోలోలో గవర్నర్ మకాం ! అసలేం జరుగుతోంది ?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సోమవారం మళ్లీ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరుకున్నారని, అక్కడ అపోలో, ఎయిమ్స్ వైద్యులతో చర్చించి జయలలిత ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నానరి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సోమవారం మళ్లీ అపోలో ఆసుపత్రికి వెళ్లారని సమాచారం. ఆదివారం రాత్రి అపోలో ఆసుపత్రి చేరుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు.
తరువాత అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ వెళ్లిపోయిన గవర్నర్ తరువాత జయలలిత ఆరోగ్యం విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆందోళన చెందారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వచ్చే వరకు పుకార్లు నమ్మరాదని పోలీసు అధికారులు పదేపదే తమిళనాడు ప్రజలకు మనవి చేస్తున్నారు.

భారీ బలగాలు... రంగంలోకి దిగిన ఆర్మీ, పారామిలటరీ !
కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు తమిళనాడు డీజీపీతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితి సమీక్షిస్తున్నారు. తమిళనాడులో 15 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని ఇప్పటికే రంగంలోకి దింపారు. తమిళనాడులోని అన్ని హైవేలు, రహదారుల్లో భారీ బందోబస్తూ ఏర్పాటు చేశామని డీజీపీ చెప్పారు.
జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి దగ్గర ఆదివారం అర్దరాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్బంగా పరిసర ప్రాంతాల్లో అన్ని వ్యాపార సంస్థలు, హోటల్స్, దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
చాల మంది స్వచ్చందంగానే దుకాణాలు, వ్యాపారాలు బంద్ చేశారు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ నుంచి తమిళనాడు వెళ్లే బస్సులు అన్నీ రద్దు చేశారు. అపోలో ఆసుపత్రి దగ్గర సోమవారం అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications