అక్రమాస్తుల ఫైళ్లను పరిశీలించిన గవర్నర్!? ఆవిరవుతోన్న శశికళ ఆశలు

తాజాగా శశికళ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఫైళ్లను గవర్నర్ విద్యాసాగర్ రావు పరిశీలించినట్టు వార్తలు వస్తున్నాయి.

చెన్నై: పన్నీర్ సెల్వం చేతిలో పవర్ అంటే.. కేవలం అలంకారప్రాయం మాత్రమే అన్న అభిప్రాయం నిన్నటిదాకా చాలామందిలో ఉండేది. కానీ ప్రస్తుత తమిళ రాజకీయాలను గమనిస్తే.. సరైన సమయంలో పన్నీర్ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఎత్తులకు పైఎత్తులతో శశికళ వ్యూహాలను చిత్తు చేస్తూ అధికారాన్ని చేజెక్కించుకునే దిశగా ఆయన కదులుతున్నారు. ఇదే క్రమంలో అంతకంతకు పట్టు కోల్పోతున్న శశికళకు షాక్ ల మీద షాక్ లు ఎదురువుతూనే ఉన్నాయి. తాజాగా శశికళ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఫైళ్లను గవర్నర్ విద్యాసాగర్ రావు పరిశీలించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్త ఇప్పటికే కలవరంలో ఉన్న శశికళ శిబిరంలో మరింత గుబులురేపుతోంది. అక్రమాస్తుల కేసును దృష్టిలో ఉంచుకుని ఎక్కడ శశికళకు వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన ఆ శిబిరంలో మొదలైంది. దీనికి తోడు శశికళ కన్నా ముందు అపాయింట్ మెంట్ దొరకడం పన్నీర్ సెల్వంకు కలిసొచ్చేదిగా మారింది.

Governor Vidyasagar Rao checked the files of Sasikalas illegal propeties case

కాగా, పన్నీర్ రాజీనామా చేసిన వెంటనే శశికళ అధికారాన్ని చేజెక్కించుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ.. అదే సమయంలో ఆమెపై ఉన్న అక్రమాస్తుల కేసుపై సుప్రీం స్పందించడం మొత్తం సీన్ నే మార్చేసింది.

దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా శశికళ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇంతలోనే పన్నీర్ తిరుగుబాటు బావుటా ఎగరేయడం శశికళను అనూహ్య రీతిలో దెబ్బకొట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+