తమిళనాడు ఎఫెక్ట్: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, గవర్నర్ విద్యాసాగర్ రావ్ భేటీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారడంతో ఆ రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ సోమవారం మద్యాహ్నం న్యూఢిల్లీలో కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సిగ్, గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు తమిళనాడు రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అసెంబ్లీలో పరువు పోకముందే సీఎం పళనిసామి రాజీనామా చెయ్యాలి: తంగ తమిళ్ సెల్వన్ !

సోమవారం తమిళనాడు స్పీకర్ ధనపాల్ 18 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అనర్హతకు గురైన టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 18 మంది ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

 Governor Vidyasagar Rao meets Union Home minister Rajnath Singh

విషయం తెలుసుకున్న గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ వెంటనే ముంబై నుంచి ఢిల్లీ చేరుకుని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తమిళనాడు రాజకీయాల విషయంలోనే ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని సమాచారం. సోమవారం సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావ్ చెన్నై చేరుకుంటున్నారు.

షాక్: రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు: గవర్నర్ రాక ముందే దినకరన్ దిమ్మ తిరిగింది!

టీటీవీ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల మీద వేటు పడటంతో తమిళనాడు స్పీకర్ ధనపాల్ మీద ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. స్పీకర్ ధనపాల్ కావాలనే దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రయత్నించారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Governor CH Vidyasagar Rao meets Union Home minister Rajnath Singh and discusses about TN political situation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X