వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్.. రాజీనామా లేఖలో సంతకం పన్నీర్ దేనా?: గవర్నర్ అనుమానం

రాజీనామా లేఖలోని సంతకం పన్నీర్ దేనా? అన్న సంగతి తేల్చాలంటూ గవర్నర్ అధికారులను ఆదేశించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: పన్నీర్ సెల్వం వెనుక కేంద్రం ఉందన్న ఆరోపణలు ఇప్పటికే వెల్లువెత్తుతుండగా.. తాజాగా జరుగుతోన్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చేవిగా మారుతున్నాయి. రోజురోజుకు ప్రతికూలతలను చేధించుకుని ముందుకెళ్తున్న పన్నీర్ కు కేంద్రం సహకరిస్తోందన్న ఆరోపణలున్నాయి.

తాజాగా ఇప్పడు ఆయన 'రాజీనామా' అంశం ఆసక్తికరంగా మారుతోంది. బలవంతంగా తన చేత రాజీనామా చేయించారని పన్నీర్ ఆరోపిస్తున్న తరుణంలో.. అసలు రాజీనామా లేఖలోని సంతకం పన్నీర్ దేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్ భవన్ అధికారుల పరిశీలనలో ఈ విషయం వెల్లడైనట్టు తెలుస్తోంది.

governor vidyasagar rao rised a doubt on Panneer selvams signature

వాస్తవానికి పన్నీర్ సెల్వం తన సంతకంలో తేదీలను, సమయాన్ని పేర్కొన్న దాఖలా ఇంతవరకు లేదని చెప్తున్నారు. కానీ గవర్నర్ కు పంపించిన రాజీనామా లేఖలో మాత్రం ఆయన సంతకం వద్ద తేదీ, సమయం రెండు ఉండటంతో.. గవర్నర్ సైతం దీనిపై అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం.

సంతకం పన్నీర్ దేనా? అన్న సంగతి తేల్చాలంటూ గవర్నర్ అధికారులను ఆదేశించారు. కాగా, పన్నీర్ రాజీనామాను ఇప్పటికే గవర్నర్ ఆమోదించగా.. ఇప్పుడు ఆయన సంతకంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తలు రావడం చర్చలకు తావిస్తోంది. తమిళ పాలిటిక్స్ విషయంలో కాస్త తటపటాయింపు ప్రదర్శిస్తున్న గవర్నర్ పై శశికళ వర్గం ఇప్పటికే తీవ్ర అసహనంలో ఉండగా.. ఇప్పుడు పన్నీర్ రాజీనామా మరోసారి వివాదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
Tamilnadu governor Vidyasagar Rao rised a doubt on Panneer selvams signature in his resignation letter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X