ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వరరావు
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ)కు నూతన డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వరరావును కేంద్రం నియమించింది. ఈ మేరకు బుధవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వరరావును నియమిస్తూ కేంద్ర కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపినట్లు నోటిఫికేషన్ వెల్లడించింది.
ప్రస్తుతం కేంద్ర బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఎన్ఎస్ విశ్వనాథన్ స్థానంలో రాజేశ్వరరావు నియామకమయ్యారు. ఆగస్టు 21న ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలను నిర్వహించింది.

కాగా, ప్రస్తుతం రాజేశ్వరరావు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజేశ్వరరావు 1984 నుంచి ఆర్బీఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2016లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన రిస్క్ మానిటరింగ్ విభాగానికి బాధ్యత వహించారు.
గతంలో ఆర్బీఐకి చెందిన ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై శాఖల్లో రాజేశ్వరరావు పనిచేశారు. ఇప్పటికే కేంద్ర ఆర్బీఐకి చెందిన మానిటరింగ్ పాలసీ కమిటీలోకి అషిమా గోయెల్, జయంత్ ఆర్ వర్మ, శశాంక బిడేలను నియమిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications