రైతులతో ముగిసిన చర్చలు -కేంద్రం తిరకాసు -ఆ రెండింటికీ ఓకే -జనవరి 4న మళ్లీ భేటీ

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన ఆరో దశ చర్చలు ముగిశాయి. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తొలి నుంచీ వాదిస్తోన్న కేంద్రం.. రైతు సంఘాల నేతలతో చర్చల్లోనూ అదే పట్టును కొనసాగించింది. రైతులు సైతం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. అయితే, ప్రధాన డిమాండ్ కు అదనంగా ఉంచిన ప్రతిపాదనలపై మాత్రం కీలక ముందడుగు పడింది..

రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన చర్చలు మగిశాయని, జనవరి 4వ తేదీన మరోసారి సమావేశం కావాలని ఉమ్మడిగా నిర్ణయించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. నేటి భేటీలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో దాదాపు 5 గంటల పాటు చర్చలు సాగించింది. వీటిలో రెండు డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పింది..

 Govt-farmers meeting concludes, center agrees for 2 demands,next talks on January 4

రైతుల డిమాండ్ మేరకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పించే అంశంపై కమిటీ వేసేందుకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది. అలాగే విద్యుత్ బిల్లులను పెండింగ్‌లో పెట్టేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. మిగతా అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని రైతులు ముందుగా తమ ఆందోళనను విరమించాలని కేంద్రం కోరింది. కానీ..

 Govt-farmers meeting concludes, center agrees for 2 demands,next talks on January 4

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెబితేనే నిరసనలు విరమించుకుంటామని రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. దీంతో తదుపరి చర్చలు జరిగే జనవరి 4 వరకు రైతుల ఆందోళనలను కొనసాగడం ఖాయమైపోయింది. రైతు సంఘాల నేతలు ఇప్పటి వరకు కేంద్రంతో ఆరు దఫాలుగా చర్చలు జరిపారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో.. రెండు డిమాండ్లపై తప్ప, చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో స్పస్టమైన క్లారిటీ రాలేదు. దాంతో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తూ వస్తున్నారు.

 Govt-farmers meeting concludes, center agrees for 2 demands,next talks on January 4
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+