వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE exams: 10వ తరగతి పరీక్షలు రద్దు: క్లాస్ 12 వాయిదా: టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ప్రమోట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే వార్షిక పరీక్షల గడువు ముంచుకొస్తోంది. వచ్చేనెలలో 10వ తరగతి, ఆపై పరీక్షలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం సమాయాత్తమౌతోంది. అదే సమయంలో ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో కనివినీ ఎరుగని రీతిలో పుట్టుకొస్తోండటం తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమౌతోంది. పరీక్షలను రాయడానికి సిద్దపడుతోన్న విద్యార్థులనూ కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ దిశగా పలు రాజకీయ పార్టీలు కేంద్రానికి విజ్ఙప్తులను పంపిస్తున్నాయి.

Recommended Video

#CBSE #EXAMS #corona సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ర‌ద్దు..12వ తరగతి పరీక్షలు వాయిదా..!

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 10వ తరగతి విద్యార్థుల అంతర్గత అసెస్‌మెంట్ ఆధారంగా వారికి మార్కులను వేస్తామని తెలిపింది. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. ఎప్పుడు నిర్వహిస్తామనేది వెల్లడించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా మారినప్పుడే 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Govt Key decison on CBSE Board exams: 10th class exams cancelled while 12th board exams postponed

ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఆ శాఖ కార్యదర్శి, కొందరు కీలక అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించాలా? వద్దా? కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. విద్యార్థులను ప్రమోట్ చేయాల్సి వస్తే.. వారికి మార్కులను కేటాయించడానికి దేన్ని ప్రాతిపదికగా, ప్రామాణికంగా తీసుకుంటారనేది ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఆన్‌లైన్ ద్వారా పరీక్షలను నిర్వహించాల్సి రావడం లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

English summary
After a meeting with Prime Minister Narendra Modi, the Ministery of Education has decided to postpone the class 12 exams and cancel the class 10 board exams. For CBSE class 12 boards, the situation will be reviewed on June 1 and revised dates will be announced thereafter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X