ఉగ్రదాడిపై రాజ్‌నాథ్: శాంతి ఒప్పందంపై సోనియా

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో ప్రకటన చేశారు. ‘బుధవారం ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.. వారి దాడుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో 14మందికి గాయాలయ్యాయి' అని తెలిపారు.

ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయని తెలిపారు. మరో ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన ఉగ్రవాది తన పేరు మహమ్మద్ నావెద్ అలియాస్ ఉస్మాన్‌గా చెప్పాడని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ నుంచి వచ్చినట్లు ఉగ్రవాది చెప్పాడని తెలిపారు. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే 47లు, గ్రేనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఉగ్రవాదిని పట్టుకోవడంలో సహకరించిన గ్రామస్తులకు హోంమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదిని పట్టుకోవడానికి సహకరించిన ఆ గ్రామస్తులకు రివార్డులు ప్రకటిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా, ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన బీఎస్ఎఫ్ జవాన్ల త్యాగం ఎప్పటికీ గుర్తుంచుకోదగినదని రాజ్ నాధ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వారికి గౌరవ వందనం చేస్తున్నట్లు తెలిపారు.

Govt must reward unarmed villagers who helped arrest Pak terrorist: Rajnath

నాగాలతో శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించిన సోనియా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై మండిపడ్డారు. నాగా తీవ్రవాదులతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల సిఎంలను సంప్రదించకుండా శాంతి ఒప్పందం చేసుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మోడీ అహంకారానికి నిదర్శనమని అన్నారు.

ఇది ఇలా ఉండగా, లోకసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన కాంగ్రెస్‌ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి, సీఎంలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

కాగా, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఉధంపూర్‌ జిల్లాలో ఉగ్రవాదుల దాడి ఘటపై కేంద్ర హోంమంత్రి ప్రకటన అనంతరం కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+