వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కటిగా డామన్ అండ్ డయ్యూ, దాద్రానగర్ హవేలి, వచ్చేవారం పార్లమెంట్ ముందుకు బిల్లు..

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారడంతో దేశంలో వాటి సంఖ్య తొమ్మిదికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలపై కేంద్రం ఫోకస్ చేసింది. డామన్ అండ్ డయ్యూ, దాద్రానగర్ హవేలిని ఒక్కటి చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే వారంలో లోక్ సభలో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రమంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రకటించారు.

ఆగస్ట్ 5న

ఆగస్ట్ 5న

మూడునెలల క్రితం జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో దాద్రానగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూను ఒక్కటి చేయాలని డిషిసన్ తీసుకున్నారు. రెండింటి నూతన పరిపాలన గుజరాత్‌కు సమీపంలోని పశ్చిమ తీరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సుపరిపాలన అందించి.. డూప్లికేట్ పనిని తగ్గించే వెసులుబాటు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

35 కి.మీలోనే..

35 కి.మీలోనే..

వాస్తవానికి డామన్ అండ్ డయ్యూ, దాద్రా హవేలి కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాల దూరం 35 కిలోమీటర్లు మాత్రమే. కాస్త దూరంలోనే రెండు సచివాలయాలు, విడివిడిగా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆర్థికభారం పడుతుంది. ఒక పనినే ఇద్దరూ చేస్తున్నారు. అలా కాకుండా రెండింటినీ కలిపితే మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దాద్రా నగర్ హవేలి ఒక జిల్లా కాగా.. డామన్ అండ్ డయ్యూ రెండు జిల్లాలన్న సంగతి తెలిసిందే.

8కి చేరనున్న సంఖ్య

8కి చేరనున్న సంఖ్య

కొత్త కేంద్రప్రాంత పాలిత ప్రాంతం పేరు దాద్రా నగర్ హవేలి డామన్ అండ్ డయ్యూగా ఉంటుంది. పరిపాలన కేంద్రంగా డామన్ అండ్ డయ్యూ ఉంటుంది. ఈ మేరకు వచ్చేవారం కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకోనుంది. దీంతో ఇప్పటివరకు రెండుగా ఉన్న కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలు ఒక్కటి కానున్నాయి. వాటి సంఖ్య 9 నుంచి 8కి చేరుకోన్నాయి.

జమ్ముకశ్మీర్, లడాఖ్

జమ్ముకశ్మీర్, లడాఖ్

ఆగస్ట్ 5వ తేదీన జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. ఆర్టికల్ 370ని రివోక్ చేసి.. జమ్ముకశ్మీర్, లడాఖ్‌ను కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలుగా మార్చింది. దీంతో ఆసేతు హిమాచలంలో ఒకటే రాజ్యాంగం అమలవుతోంది.

English summary
two Union Territories - Daman and Diu, and Dadra and Nagar Haveli - will be merged into one and a bill in this effect will be tabled in Parliament next week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X