రూ. 6 లక్షలకు మించి నగలు కొన్నారా? కేంద్రం కంటికి చిక్కినట్లే!

న్యూఢిల్లీ: నల్లధనం చలామణిని, మనీలాండరింగ్‌ను అరికట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా రూ. 6 లక్షలకు‌పైగా విలువైన కొనుగోళ్లపై నిఘా వేసింది.

ఎవరైనా రూ.6 లక్షలకు పైగా నగలు లేదా విలాస వస్తువులను కొనుగోలు చేస్తే, ఆ లావాదేవీలను విచారించాలని ఆదాయపు పన్ను శాఖతో పాటు రెవెన్యూ, ఇంటెలిజెన్స్ ఏజన్సీలను కేంద్రం ఆదేశించింది.

Govt to scan purchases above Rs 6 lakh, mainly luxury goods and jewellery

ఈ తరహా లావాదేవీలను పరిశీలించాలని, అవకతవకలు కనిపిస్తే, కేసులు పెట్టి విచారించాలని కేంద్ర నిఘా విభాగాల అధికారులకు ఆదేశాలు అందాయి. బినామీ లావాదేవీలు నిర్వహిస్తూ, అక్రమంగా డబ్బు చలామణి చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది.

నగదు లావాదేవీలు రూ. 2 లక్షలకు మించరాదని, రూ. 50 వేలకు పైగా జరిపే లావాదేవీలకు పాన్ నంబరు తప్పనిసరని కేంద్రం గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ. 6 లక్షలకు మించిన అన్ని కొనుగోళ్లనూ పరిశీలించాలని అధికారులకు సూచించింది.

ఈ రూ.6 లక్షల కొనుగోళ్లు కేవలం బంగారు ఆభరణాలు, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్లకు సంబంధించినవి. అంతేకాదు, ఇక రూ. 50 లక్షలకుపైగా జరిపిన ఆస్తుల కొనుగోళ్లను కూడా ఐటీ శాఖ పరిశీలించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+