68 మంది జడ్జీలు: కొలిజీయం సిఫారసుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం...?
దేశంలో 68 మంది జడ్జీల పేర్లతో సుప్రీంకోర్టు కొలిజీయం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 68 మందిలో న్యాయాధికారులు, అడ్వకేట్లు, జడ్జీలు ఉన్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 8వ తేదీ సెప్టెంబర్ 1వ తేదీ వరకు కొలిజీయం వివిధ రాష్ట్రాల్లో గల 100 మంది పేర్లను పరిశీలించింది. అందులో 68 మందిని ఎంపిక చేసి.. 12 రాష్ట్రాలకు జడ్జీలుగా నియమించాలని కోరింది.
సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో కొలిజీయం ఈ మేరకు సిఫారసు చేసింది. 68 మందిలో కర్ణాటక నుంచి ఇద్దరు, జమ్ముకశ్మీర్ నుంచి ఒకరిని మూడోసారి కొలిజీయం సిఫారసు చేసింది. 10 మంది జడ్జీలను కొలిజీయం రెండోసారి సిఫారసు చేసింది. మిగతా వారు మాత్రం ఫస్ట్ టైమ్ సిఫారసు చేసింది. ఆగస్ట్ 17వ తేదీన 9 మంది జడ్జీలలో ముగ్గురు మహిళలు ఉన్నారు. శుక్రవారం కొలిజీయం 8 మంది జడ్జీలను సిఫారసు చేసింది. వారిలో కోలకతా తాత్కాలిక చీఫ్ జస్టిస్ జస్టిస్ రాజేశ్ బిందాల్ ఉన్నారు. త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అనిల్ కురేషి.. 28 మంది జడ్జీలను ట్రాన్స్ ఫర్ చేయాలని కోరింది. దేశంలో 25 హైకోర్టులో 1098 మంది జడ్జీలు ఉన్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ వరకు 465 ఖాళీలు ఉన్నాయని న్యాయశాఖ పేర్కొంది.

ఇదివరకు సిఫారసు చేసిన వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. అలహబాద్ హైకోర్టుకు 13 మంది లాయర్లను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది.. అలహబాద్ హైకోర్టులో ప్రస్తుతం 92 మంది న్యాయమూర్తులు ఉన్నారు.. అలహబాద్ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 160 కాగా.. భర్తీ చేయాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 68గా ఉంది.. ఇక, కేరళ హైకోర్టుకు 8 మంది న్యాయమూర్తులను నియామకం చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది.. అందులో నలుగురు లాయర్లు. మరో నలుగురు న్యాయాధికారులు ఉన్నారు.
జార్ఖండ్ హైకోర్టుకు ఐదుగురు జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది కొలీజియం. మధ్యప్రదేశ్ హైకోర్టుకు 1 లాయర్ ను న్యాయమూర్తిగా నియామకం చేస్తూ సిఫార్సులు ఇచ్చింది. పంజాబ్ హైకోర్టుకు నలుగురు లాయర్లను న్యాయమూర్తులుగా నియామకానికి సిఫార్సు చేయగా.. రాజస్థాన్ హైకోర్టుకు ముగ్గురు లాయర్లను, మరో ముగ్గురు జ్యుడిషియల్ అధికారులు కలిపి మొత్తం ఆరుగురు న్యాయమూర్తులను సిఫార్సు చేసింది. గౌహతి హైకోర్టు కు ముగ్గురు లాయర్లను, మరో ఇద్దరు జ్యుడిషియల్ అధికారులను కలిపి ఐదుగురిని న్యాయమూర్తులుగా నియామకం చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
Recommended Video
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు రాజీనామాను ధృవీకరిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఛత్తీస్‌ఘడ్ హైకోర్టుకు ఒక లాయర్‌ను, ఒక జ్యుడిషియల్ అధికారిని మొత్తం ఇద్దరిని న్యాయమూర్తులుగా నియామకానికి సిఫార్సు చేయగా.. జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు ఇద్దరు జ్యుడిషియల్ అధికారులను మరో ఇద్దరు లాయర్లు.. మొత్తం నలుగురిని న్యాయమూర్తులుగా నియామకం చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications