సిద్దరామయ్యను కలిసిన గౌతమి కుటుంబ సభ్యులు
బెంగళూరు: కాడుగోడిలోని ప్రగతి కాలేజ్ లో పీయుసీ విద్యాభ్యాసం చేస్తూ అదే కాలేజ్ అటెండర్ జరిపిన కాల్పులలో మరణించిన గౌతమి (18) కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. గౌతమిని హత్య చేసిన మహేష్ ను కఠినంగా శిక్షించాలని సిద్దరామయ్యకు మనవి చేశారు.
జేడీఎస్ పార్టీ విధాన పరిషత్ సభ్యుడు టి.ఎ. శరవణ, పావగడ శాసన సభ్యుడు తిమ్మరాయప్పతో కలిసి గౌతమి కుటుంబ సభ్యులు, గాయాలైన శిరీష కుటుంబ సభ్యులు సిద్దరామయ్యను కలిశారు. కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చేసి నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.

అనంతరం బయటకు వచ్చిన ఎంఎల్ సీ శరవణ మీడియాతో మాట్లాడుతూ - నిందితుడు మహేష్ ను ఇప్పటికే అరెస్టు చేశారని, అతను రివాల్వర్ ఎక్కడ నుండి తీసుకు వచ్చాడనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారని సిద్దరామయ్య తమకు చెప్పినట్లు తెలిపారు.నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని సిద్దరామయ్య హామి ఇచ్చారని చెప్పారు.
మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న శిరీషాకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని, ఇప్పటికే అధికారులు ఆసుపత్రికి లేఖ వ్రాశారని సిద్దరామయ్య అన్నారని శరవణ వివరించారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని గౌతమి కుటుంబ సభ్యులు, శిరీష కుటుంబ సభ్యులు చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications