జీపీఎస్ నమ్ముకుని వెళ్తే కారును నదిలో పడేసింది: ముగ్గురు మృతి

ఇటీవల కాలంలో జీపీఎస్‌ను నమ్మి వెళితే ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. జీపీఎస్‌ను నమ్మి వెళ్లినప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. తాజాగా ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. జీపీఎస్‌ను నమ్మి వెళ్లి ఓ కారు బ్రిడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటా గంజ్‌కి వెళుతున్న కారు జీపీఎస్ సహకారంతో ముందుకు కదులుతోంది. అయితే, అలాగే ముందుకు వెళ్లిన కారు బ్రిడ్జి పైనుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటన ఫరీద్‌పూర్ సమీపంలో చోటు చేసుకుంది.

GPS-guided car falls off bridge into river Three dead

బ్రిడ్జి పాడైన విషయం తెలియక కారును బ్రిడ్జిపైనుంచి పోనివ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు బ్రిడ్జిపైనుంచి పడిన కారులోంచి ముగ్గురిని బయటకు తీశారు. అయితే, అప్పటికే కారులోని ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు సోదరులు కావడం గమనార్హం.

మృతులను ఫరూఖాబాద్‌కు చెందిన వివేక్ కుమార్, అమిత్ గా గుర్తించారు. మూడో వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో వరదల కారణంగా ఈ వంతెన మధ్య భాగం నదిలో కూలిపోయింది. ఈ విషయాన్ని జీపీఎస్ అప్‌డేట్ చేసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.

అయితే, వంతెన పాడైపోయి ఉన్నప్పటికీ.. వాహనదారులు వెళ్లకుండా ఉండేందుకు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులపై బాధితుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+